మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల (Niharika Konidela) వ్యక్తిగత జీవితం కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటోంది. భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) నుంచి ఆమె విడాకులు కోరుతున్నారని, మనస్పర్థలు రావడంతో ఇద్దరూ వేరు పడ్డారని, విడివిడిగా ఉంటున్నారనే విషయాలు బయటకు వచ్చాయి. అది నిజమే! ఇప్పుడు విడాకుల కోసం నిహారిక, చైతన్య జొన్నలగడ్డ కోర్టు మెట్లు ఎక్కారు.
కోర్టులో విడాకులకు దరఖాస్తు
హైదరాబాద్, కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక కొణిదెల దరఖాస్తు చేశారు. ఆల్రెడీ విడివిడిగా ఉంటున్న నిహారిక, చైతన్యకు చట్టబద్ధంగా విడాకులు రావడం లాంఛనమే అని కోర్టు వర్గాలు చెబుతున్నాయి.
ఇన్‌స్టాలో ఫోటోలు డిలీట్ చేయడంతో...
నిహారిక, చైతన్యల వివాహం డిసెంబర్, 2020లో జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ కోటలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దానికి కొన్ని నెలల క్రితం ఆగస్టు 13న హైదరాబాద్ సిటీలో నిశ్చితార్థం జరిగింది. నిహారిక పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యింది. ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది అతిథులను ఆహ్వానించారు.
పెళ్లి తర్వాత కొన్ని రోజులు అంతా సవ్యంగా ఉంది. చైతన్యను సినిమా వేడుకలకు నిహారిక తీసుకు వచ్చేవారు. తాను నిర్మించిన 'ఒక చిన్న ఫ్యామిలీ' వెబ్ సిరీస్ ఫంక్షన్‌లో భర్తతో కలిసి సందడి చేశారు. ఇద్దరూ స్పెయిన్ వెళ్లారు. ఇంకా ఫారిన్ టూర్లు వేశారు. ఏమైందో ఏమో... ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కారణాలు తెలియదు గానీ... చైతన్య ఫోటోలను నిహారిక డిలీట్ చేయడంతో సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులకు కూడా డౌట్ వచ్చింది. ఆరా తీయగా... అసలు విషయం బయటపడింది.
Also Read : సమంత మెడలో నల్లపూసలు - పెళ్లి గురించి హింట్?
మెగా ఫ్యామిలీలో కజిన్స్ అందరూ ఫెస్టివల్స్, సెలబ్రేషన్లలో కలుస్తారు. ఒక ఉదాహరణ ఇవ్వాలంటే... క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ వేడుకలు! నిహారిక పెళ్లైన కొత్తల్లో చైతన్య కూడా ఆ వేడుకల్లో కనిపించేవారు. ఇన్స్టాలో నిహారిక ఫోటోలు డిలీట్ చేసిన తర్వాత ఆయన కనిపించడం మానేశారు.
వరుణ్ తేజ్ నిశ్చితార్థంలోనూ లేరు
ఇటీవల వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకల్లో చైతన్య జొన్నలగడ్డ కనిపించలేదు. అన్న, కాబోయే వదినతో కలిసి దిగిన ఫోటోను నిహారిక షేర్ చేయగా... 'ఆయన ఎక్కడ?' అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. విడాకుల దరఖాస్తు చేయడంతో కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయం అధికారికంగా బయటకు వచ్చింది.
మహారాష్ట్రలో చైతన్య మెడిటేషన్?
విడాకుల వార్త గుప్పుమన్న తర్వాత నిహారికా కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన 'డెడ్ పిక్సల్స్' వెబ్ సిరీస్ విడుదల అయ్యింది. ఆ సిరీస్ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలలో పెళ్లి ప్రశ్నలు రాకుండా జాగ్రత్త పడ్డారు. చైతన్య అయితే మీడియా ముందుకు రాలేదు. నాలుగు రోజుల క్రితం తాను మహారాష్ట్రలో ఉన్నట్లు ఆయన పోస్ట్ చేశారు. మెడిటేషన్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా హీరో కళ్యాణ్ దేవ్ తో విడిపోయినట్టు టాక్. అయితే, ఆ విషయంలో అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.
Also Read : 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వైఎస్ జగన్ సర్కార్ పెన్షన్ స్కీమ్ మీద పంచ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial