యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) తీసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'. బాక్సాఫీస్ బరిలో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. భారీ వసూళ్ళను సాధించింది. ఆ సినిమా ఎండింగులో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. తామిద్దరం మరో సినిమా చేస్తామని రామ్, పూరి అనౌన్స్ చేశారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్ ప్రకటించారు. మరి, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ముహూర్తం ఎప్పుడు? అంటే


జూలై 9న 'డబుల్ ఇస్మార్ట్'కు పూజ!
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ (Ismart Shankar Sequel)కు 'డబుల్ ఇస్మార్ట్' టైటిల్  ఖరారు చేశారు. పూరి స్పీడు గురించి తెలిసిందే కదా! సినిమా అనౌన్స్ చేసిన రోజున రిలీజ్ డేట్ కూడా చెబుతారు. వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చెప్పారు. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. 


జూలై 7న పూజా కార్యక్రమాలతో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా (Double Ismart Movie)ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఐదు రోజులకు సెట్స్ మీదకు వెళ్లనున్నారు. జూలై 12 నుంచి 'డబుల్ ఇస్మార్ట్' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 


Also Read : మళ్ళీ మేజిక్ చేసిన శేఖర్ చంద్ర - 'నిజమే నే చెబుతున్నా'కు మూడు కోట్ల వ్యూస్ 


'ఇస్మార్ట్ శంకర్'లో హైదరాబాదీ యువకుడిగా రామ్ పోతినేని సందడి చేశారు. ఇక, సినిమాలో తెలంగాల యాసలో ఆయన చెప్పిన డైలాగులు పాపులర్ అయ్యాయి. రామ్ నటన, పూరి మార్క్ డైలాగులు & దర్శకత్వానికి తోడు మణిశర్మ సంగీతం సైతం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడీ సినిమాకు కూడా ఆయన్ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. 


బోయపాటి దర్శకత్వంలో 'స్కంద'
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ పోతినేని నటించిన రెండు సినిమాలు... 'రెడ్', 'ది వారియర్' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు. ఆ చిత్రానికి 'స్కంద' టైటిల్ ఖరారు చేసినట్లు ఇటీవల వెల్లడించారు.


Also Read : షారుఖ్ ముక్కుకు బ్యాండేజ్ - అమెరికాలో జరిగిన ప్రమాదం ఏమిటంటే?


'స్కంద' టైటిల్ గ్లింప్స్ బోయపాటి మార్క్ దర్శకత్వం అంతటా కనిపించింది. ఓ  దేవాలయం ప్రాంగణంలో రౌడీలను కథానాయకుడు ఊచకోత కోసే సన్నివేశాలను చూపించారు. ''మీరు దిగితే ఊడేది ఉండదు... నేను దిగితే మిగిలేది ఉండదు'' అని రామ్ పోతినేని చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ టైటిల్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేశారు. టైటిల్ గ్లింప్స్‌లో చూపించిన ఫైట్ కాకుండా బుల్ ఫైట్ కూడా అద్భుతంగా వచ్చిందని టాక్. ఈ సినిమాలో ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ అవుతాయట. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial