హిందూ సంప్రదాయం ప్రకారం మెడలో నల్లపూసలు ఎవరు ధరిస్తారు? వివాహమైన ఆడవారు! సమంత మెడలో నల్లపూసలు ఉన్నాయంటే... ఆమెకు వివాహమైందని అనుకోవాలా? సామ్ పెళ్లి గురించి హింట్ ఇచ్చారా? బోలెడు ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో తలెత్తుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే... 


'ఖుషి'... సమంతకు పెళ్లైంది!
సమంత మెడలో నల్లపూసలు కనిపించడం నిజమే! అయితే... ఆ ఫోటోను ఎవరో తీయలేదు. స్వయంగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెట్స్ నుంచి సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో పోస్ట్ చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు జంటగా సమంత నటిస్తున్న తాజా సినిమా 'ఖుషి'. అది ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పటి ఫోటో!


'ఖుషి' నుంచి ఓ పాట విడుదలైంది. హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. అవన్నీ చూస్తే... ప్రేక్షకులకు ఒక్క విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతి పాత్ర చేస్తున్నారని! అలాగే, ఐటీ ఉద్యోగిగా కూడా కనిపిస్తారని! కథలో భాగంగా ఆమె వివాహితగా కూడా కనిపిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. షూటింగ్ కోసమే ఆమె నల్లపూసలు ధరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవిడ ఇచ్చిన హింట్ సినిమాలో పెళ్లి గురించి అనుకోవాలి. అదీ సంగతి! 


చైతూతో విడాకుల తర్వాత...
Samantha Second Marriage : అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత... మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన సమంతకు ఉన్నట్లు లేదనుకుంట! 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో సినిమాల్లో చూపించినట్టు నిజ జీవితంలో వైవాహిక సంబంధాలు ఉండవని ఆమె వ్యాఖ్యానించారు. చాలా మంది సంసార జీవితాల్లో సంతోషాలు లేకపోవడానికి కరణ్ జోహార్ కారణమని చెప్పారు. అయితే... విడాకుల తర్వాత సమంత నటించిన 'యశోద', 'శాకుంతలం' సినిమాలు విడుదల అయ్యాయి. ఆ ఇంటర్వ్యూల్లో మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడలేదు.


Also Read : 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వైఎస్ జగన్ సర్కార్ పెన్షన్ స్కీమ్ మీద పంచ్!


'ఖుషి'కి వస్తే... ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన 'నా రోజా నువ్వే...'కు తెలుగు సాహిత్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ అందించారు. ఆ పాటను సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ పాడారు. పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి'ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. పాటను కూడా ఈ ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 


Also Read రవితేజ సినిమాలో శర్వా బదులు విశ్వక్ సేన్ - విలన్‌గా మంచు మనోజ్?  



మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.  




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial