నేరల తీరు మారుతున్నప్పుడు కచ్చితంగా విచారణలో కూడా మార్పులు రావాల్సిన అవసరాన్ని చెప్పింది మద్రాస్ హైకోర్టు. నిందితులు ఆన్‌లైన్‌ వీడియోలు చూసి నేరాలకు పాల్పడుతున్నప్పుడు ఆ వేదికలపై కేసులు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది. 



తమిళాడులో  వ్యక్తిపై కేసు నమోదైంది. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టి సొమ్ము చేసుకుంటున్నాడని అతనిపై కేసు రిజిస్టర్ అయింది. అరెస్టు కూడా పోలీసులు చేశారు. నేర తీవ్రత నిరూపించలేని కారణంగా అతనికి బెయిల్‌ వచ్చింది. 


నిందితుడి బెయిల్ రద్దు కోరుతూ తమిళనాడు పోలీసులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు యూట్యూబ్‌ ద్వారా ఎంత సంపాదించాడో పూర్తి వివరాలు అందివ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ విచారణ టైంలోనే సోషల్ మీడియాపై కీలక కామెంట్స్ చేసింది.


సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. నేరాలు ఎలా చేయాలి, ఆయుధాలు ఎలా తయారు చేయాలో కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్‌ మీడియా వేదికలను ఇలాంటి కేసుల్లో ఎందుకు చేర్చడం లేదని పోలీసులను ప్రశ్నించింది. దీనికి సమాధాం చెప్పాలని పోలీసులను ఆదేశించింది. సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ దుర్వనియోగం కాకుండా విధి విధానాలు రూపొందించాలని తమిళనాడు ఏడీజీపీ, సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 


గతంలో కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియా తీరుపై మద్రాసు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు నిందితుల జాబితాలో ఎందుకు చేర్చకూడదంటూ ప్రశ్నించింది. 


Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు


Also Read: Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి


Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..


Also Read: ఎవడో ఏదో థంబ్‌నైల్‌ పెట్టి రాసుకుంటున్నాడు... - లాస్య కన్నీరు
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు.. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే...
Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్... రెండిటిలో ఏదో ఒక రోజున!
Also Read: 'మీరు గనుక ఉంటే మైక్ విసిరేసేవాళ్లు... బాలయ్యపై మహేష్ సెటైర్లు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి