యూఎస్‌ కెనడా సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటుతూ ఓ ఫ్యామిలీ బలైపోయింది. అతి శీతల వాతావరణం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. 


ఎమర్సన్ సమీపంలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో ఈ దుర్ఘటన జరిగింది. మైనస్ 35 డిగ్రీల చలిలో ఆ భారతీయ ఫ్యామిలీ గడ్డకట్టుకుపోయి మృతి చెందింది. చనిపోయినవారిలో భార్య, భర్త, టీనేజి బాబు, నవజాత శిశువు ఉన్నారు. 






కెనడా సరిహద్దు దాటి యూఎస్‌లో ప్రవేశించిన మరికొందర్ని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం పట్టుకుంది. 


పట్టుకున్నవారిలో ఒకరి వద్ద నవజాత శిశువుకు సంబంధించిన ఆహారం, డైపర్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఆ టీంలో నవజాత శిశువు లేకపోవడంతో అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. 






వాళ్లు ఇచ్చిన సమాచారంతో కెనడా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు యూఎస్ అధికారులు. ఈ ఇన్ఫర్మేషన్‌తో సరిహద్దుల్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుడే ఆ నలుగురి మృతదేహాలను గుర్తించారు. 






ఇలా సరిహద్దులు దాటుతున్న వారంతా భారతీయులుగా అమెరికా అధికారులు గుర్తించారు. షికాగో (యూఎస్)లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, టొరంటో (కెనడా)లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 


చలికి చనిపోయిన ఫ్యామిలీ మృతదేహాలను భారత్ పంపించేందుకు భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దులు దాటించే ముఠాను నమ్ముకుని వీళ్లంతా  బలయ్యారు. సరిహద్దుకు 9-10 మీటర్ల దూరంలో ఈ ఫ్యామిలీ చనిపోయింది. 


ప్రతికూల వాతావరణంలో సరిహద్దులు దాటించే ప్రయత్నం చేసిందా ముఠా. చిమ్మ చీకట్లలో ఎటుచూసినా కమ్ముకున్న మంచులో కాలినడక ప్రయాణమయ్యారు. అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో సరిహద్దులు దాటే ప్రయత్నంలో ఇలా విగతజీవులుగా పడి ఉన్నారు. 


మరోవైపు భారతీయుల అక్రమ రవాణా వ్యవహారంలో ఫ్లోరిడాకు చెందిన స్టీవ్ షాండ్‌ను అధికారులు అరెస్టు చేశారు. మనుషుల అక్రమ రవాణా అభియోగాల కింద కేసు నమోదు చేశారు. కెనడా నుంచి యూఎస్‌కు, యూఎస్ నుంచి కెనడాకు జనాలను అక్రమంగా సరిహద్దులు దాటించడమే స్టీవ్ షాండ్ పని.


సరిహద్దులు దాటిన ఐదుగురు భారతీయుల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. 11 గంటల పాటు చిమ్మ చీకట్లలో అతిశీతల వాతావరణం నిర్విరామంగా నడిచి సరిహద్దు దాటినట్టు చెప్పిన భారతీయులు. 


Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!


Also Read: ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !


Also Read: మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి