గ్లోబల్ స్టార్‌ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్‌తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. 


సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చింది ప్రియాంక. ఇప్పుడు తన ఫ్యామిలీపై పూర్తిగా ఫోకస్ పెట్టబోతున్నామని... అందుకే తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఉండాలని అందర్నీ రిక్వస్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


నిక్‌, ప్రియాంక 2018లో వివాహం చేసుకున్నారు. ఇలాంటి విషయం ఎప్పుడు చెప్తారా అని ఎప్పటి నుంచే ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి వాళ్ల కోరిక తీరింది. ప్రియాంక, నిక్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. 






ఈ మధ్య కాలంలో చాలా మందికి ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో నిక్‌ ప్రియాంక కూడా చేరిపోయారని పుకార్లు కూడా వచ్చాయి. వివిధ సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు. అయినా పుకార్లు ఆగలేదు.  ఇప్పుడు ఇలా సమాధానం చెప్పారీ సెలబ్రెటీ కపుల్.