Prabhas - Maruthi Movie: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?

మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమాకు నిర్మాత ఎవరు? టైటిల్ ఏంటి? జానర్ ఏంటి? ఇతర వివరాలు ఏమిటి? అనేది తెలుసుకోవడానికి ఓ లుక్కేయండి!

Continues below advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్‌లో ఉంది. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ... 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చేస్తున్నారు. 'రాధే శ్యామ్' విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాలు కాకుండా మరో సినిమాను ప్రభాస్ ఓకే చేశారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం... మారుతి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారు.

Continues below advertisement

అవును... మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. కొత్త యంగ్ రెబల్ స్టార్‌ను ఈ సినిమాలో చూడొచ్చట. మూడు నాలుగు నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. ఈ వేసవి తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. భారీ సెట్స్ గట్రా అవసరం లేకుండా సినిమాను చిన్నగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ప్రభాస్, అతని సన్నిహితులతో మారుతికి మంచి స్నేహం ఉంది. మారుతి దర్శకత్వ శైలి గురించి ప్ర‌భాస్‌కు తెలుసు. ఇదొక హారర్ కామెడీ మూవీ. దీనికి 'రాజు డీలక్స్' (Raju Delux) టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మారుతి మంచి కథ తీసుకు రావడంతో ప్రభాస్ ఓకే చేశారట. ఆల్రెడీ 'ప్రేమ కథా చిత్రమ్' వంటి హారర్ కామెడీ తీసి హిట్ కొట్టిన అనుభవం మారుతికి ఉంది. 'స్పిరిట్' కంటే ముందు ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారట.

ప్రభాస్ కజిన్ ప్రమోద్ ఓ నిర్మాణ భాగస్వామి అయిన యువి క్రియేషన్స్‌లో 'భలే భలే మగాడివోయ్', 'మంచి రోజులు వచ్చాయి' సినిమాలకు మారుతి దర్శకత్వం వహించారు. జీఏ 2 (గీతా ఆర్ట్స్ 2) పిక్చర్స్ భాగస్వామ్యంతో యువి క్రియేషన్స్ నిర్మించిన 'భలే భలే మగాడివోయ్', 'ప్రతి రోజూ పండగే' సినిమాలు చేశారు మారుతి. ఇప్పుడు 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నారు.

Also Read: ఎవడో ఏదో థంబ్‌నైల్‌ పెట్టి రాసుకుంటున్నాడు... - లాస్య కన్నీరు
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు.. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే...
Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్... రెండిటిలో ఏదో ఒక రోజున!
Also Read: 'మీరు గనుక ఉంటే మైక్ విసిరేసేవాళ్లు... బాలయ్యపై మహేష్ సెటైర్లు...
Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌
Also Read: విడాకుల అనౌన్స్మెంట్... పోస్ట్ డిలీట్ చేసిన సమంత...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement