యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. సంక్రాంతికి వారం ముందు థియేటర్లలో సినిమా సందడి చేయడం పక్కా అని అనుకున్నారంతా! ఎందుకంటే... ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించారు. అంతా బావుంది అనుకున్న సమయంలో కరోనా మూడో దశ వచ్చింది. దాంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
మార్చి 18న లేదంటే.. ఏప్రిల్ 28న (RRR New Release Date) 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఈ రోజు సినిమా టీమ్ వెల్లడించింది. వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ... పీరియాడికల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. "దేశంలో కరోనా తగ్గి... థియేటర్లు తెరుచుకుని ఫుల్ కెపాసిటీతో రన్ అయితే... మార్చి 18న సినిమా విడుదల చేయడానికి మేం రెడీగా ఉన్నాం. లేదంటే ఏప్రిల్ 29న సినిమా విడుదల అవుతుంది" అని 'ఆర్ఆర్ఆర్' టీమ్ పేర్కొంది.
కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ (NTR), అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు.
Also Read: హిందూ ధర్మం జోలికి వస్తే దేవుడు 'అఖండ'లా బుద్ధి చెబుతాడు! - బాలకృష్ణ
Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
Also Read: ఫ్రెండ్స్... ఆ దరిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియస్‌గా తీసుకోండి! - తరుణ్ భాస్కర్
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి