నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా 'అఖండ'. 'సింహ', 'లెజెండ్' చిత్రాల జైత్రయాత్రను కొనసాగిస్తూ అఖండ విజయం సాధించింది. ఈ సినిమా అర్ధ శతదినోత్సవ వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లో గ‌ల‌ సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో జరిగింది. అక్కడికి వస్తున్నప్పుడు నాన్న (ఎన్టీఆర్) గారి కోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ రామకృష్ణ స్టూడియోకు వెళ్లిన రోజులను గుర్తు చేస్తున్నారు బాలకృష్ణ. అలాగే, సినిమా విజయాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. తండ్రి చేసిన పాత్రలను గుర్తు చేసుకుంటూ 'అఖండ'లో శివ భక్తుడిగా చేశానని అన్నారు.


ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ "కరోనా కాలంలో ప్రేక్షకులు వస్తారో? రారో? అని అనుకుంటున్న సమయంలో 'అఖండ' చూడటం కోసం తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఈ సినిమా విజయాన్ని చేకూర్చేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో హిందూ సమాజం, ధర్మం, పద్ధతుల గురించి చెప్పాం. వాటి జోలికి ఎవరైనా వస్తే... ఆ దేవుడు 'అఖండ'లా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాళనగా ఈ సినిమా ఉంది. 'అఖండ' విజయానికి కారకులు ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు... పాన్ వరల్డ్ సినిమా" అని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.


బోయపాటి శ్రీనుతో కాంబినేషన్ జన్మజన్మలదని బాలకృష్ణ అన్నారు. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులకు యాభై రోజుల జ్ఞాపికలను ఆయన అందజేశారు. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారని, ఈ విజయం  నందమూరి అబిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమది అనీ, 'అఖండ' సినిమా సుమారు వంద థియేటర్లలో ఆడుతోందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. యాభై రోజులైనా 'అఖండ' థియేటర్లలో ఆడుతోందని, ఇంత విజయం అందించిన ప్రేక్షకులకు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. 


Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి