స్టార్ హీరో హీరోయిన్లు అయినా.... బుల్లితెర తారలు అయినా... నెగెటివిటీకి ఎవరూ అతీతులు కారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఎవరెవరో ఏదేదో కామెంట్ చేస్తూ ఉంటారు. అస‌లు వార్త‌కు, హెడ్డింగ్‌కు సంబంధం లేకుండా ఏవేవో థంబ్‌నైల్స్ పెడ‌తారు. అటువంటి వాటి గురించి 'సూపర్ క్వీన్' షోలో యాంకర్, నటి లాస్యా మంజునాథ్ కన్నీరు పెట్టుకున్నారు.


లాస్యా మంజునాథ్ మాట్లాడుతూ "నా మీద వచ్చే నెగెటివిటీ ఏదైతే ఉందో... వాడు ఎవడో నెగెటివ్‌గా రాసుకుంటున్నాడు యూట్యూబ్‌లో. వాడు ఎవడో ఏదో థంబ్‌నైల్‌ పెట్టి రాసుకుంటున్నాడు. నెగెటివిటీ అనేది ఎక్కువ ఫేస్ చేశాను. 'అయ్యో ఇది అనుకుంటున్నారు... అయ్యో అది అనుకుంటున్నారు' అని మనసులో పెట్టుకునేదాన్ని. నిద్ర ఉండేది కాదు... డిప్రెషన్" అంటూ కన్నీరు పెట్టుకున్నారు. గతంలో కూడా కొంత మంది తారలు నెగెటివిటీ, థంబ్‌నైల్స్ గురించి మాట్లాడారు. తొలుత అటువంటి థంబ్‌నైల్స్ ఎఫెక్ట్ చూపించాయని... తర్వాత తర్వాత వాటిని పట్టించుకోవడం మానేసినా, కుటుంబ సభ్యుల మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.


లాస్యా మంజునాథ్ మాట్లాడిన తర్వాత ప్రముఖ యాంకర్ శ్రీముఖి స్పందించారు. "ఉదయం ఎప్పుడో ఏడు గంటలకు వచ్చి రెడీ అయితే... నెక్స్ట్ డే నైట్ మూడు, నాలుగు గంటల వరకూ చేస్తూనే ఉంటారు. సో... ఐయామ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ థిస్ షో. ప్రతి మహిళకుయ్ సెల్యూట్ చేస్తున్నాను" అని శ్రీముఖి అన్నారు.





 


Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్... రెండిటిలో ఏదో ఒక రోజున!
Also Read: ప్రేమికుల రోజున మహేష్ అభిమానులకు తమన్ సంగీత కానుక!
Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి