సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారా? అంటే... 'అవును' అనే సమాధానం వినబడుతోంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ఫిబ్రవరి 14 డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
మహేష్ బాబు - తమన్ కాంబినేషన్‌లో 'దూకుడు', 'బిజినెస్ మేన్', 'ఆగడు' వచ్చాయి. ఆయా సినిమాల్లో పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అప్పటితో పోలిస్తే... ఇప్పుడు తమన్ మరింత ఫామ్‌లో ఉన్నాడు. అందుకని, ఎటువంటి మ్యూజిక్ ఇస్తాడోనని మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 'ఇంతే ఒక వెయ్యి' అనే సాంగ్ షూటింగ్ టైమ్‌లో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ సాంగ్ విడుదల చేస్తారా? కొత్త సాంగ్ విడుదల చేస్తారా? అన్నది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.
మహేష్ బాబు మోకాలి సర్జరీ చేయించుకోవడం, ఆ తర్వాత ఆయనకు కరోనా రావడంతో షూటింగుకు బ్రేక్ పడింది. ఫిబ్రవరిలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ తేదీకి చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య'ను తీసుకురానున్నట్టు ప్రకటించారు. దాంతో సర్కారు వారి పాట వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. అయితే... దీనిపై చిత్రబృందం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్న 'సర్కారు వారి పాట'కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆంజనేయులు', 'శ్రీరస్తూ శుభమస్తు' తర్వాత దర్శకుడితో తమన్ కు మూడో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: హిందూ ధర్మం జోలికి వస్తే దేవుడు 'అఖండ'లా బుద్ధి చెబుతాడు! - బాలకృష్ణ
Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
Also Read: ఫ్రెండ్స్... ఆ దరిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియస్‌గా తీసుకోండి! - తరుణ్ భాస్కర్
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి