Oscars 2022: ఆస్కార్ అర్హత లిస్ట్ లో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'

ఆస్కార్ 2022 అర్హత లిస్ట్ లో సూర్య 'జై భీమ్', మోహన్ లాల్ 'మరక్కార్' చోటు దక్కించుకున్నాయి.

Continues below advertisement

కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య.. ఈ మధ్యకాలంలో ఆయన హిట్టు మీద హిట్టు కొడుతున్నారు. ఆయన నటించిన 'ఆకాశం నీ హద్దురా..', 'జైభీమ్' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఓటీటీల్లోనే విడుదలైన ఈ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 
 
ముఖ్యంగా 'జైభీమ్' సినిమా ఎందరినో కదిలించింది. జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అన్యాయంగా తన భర్తను జైల్లో పెట్టారని.. అతడిని కాపాడుకోవడానికి ఓ గిరిజన మహిళ చేసే పోరాటంలో చంద్రు ఆమెకి సాయం చేస్తారు. నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను రూపొందించగా.. సూర్య స్వయంగా నిర్మించారు.

Continues below advertisement

రీసెంట్ గా అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో 'సీన్‌ ఎట్‌ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్ లో చోటు దక్కించుకునే అవకాశం వచ్చింది. బెస్ట్ ఫీచర్ ఫిలింగా ఆస్కార్ 2022 అవార్డ్స్ కి నామినేట్ అవ్వడానికి ఈ సినిమా అర్హత కలిగిన లిస్ట్ లో ఉంది. ఫిబ్రవరి 8న పూర్తి నామినేషన్ లిస్ట్ వస్తుంది. అందులో 'జైభీమ్' ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఆస్కార్ అర్హత లిస్ట్ లో చోటు దక్కించుకుంది.

ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ 'మరక్కార్' కూడా ఆస్కార్ అర్హత లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. హిస్టారిక్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇందులో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ కూడా నటించారు. 

Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!

Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!

Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌

Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!

Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement