కార్తీకదీపం జనవరి 21 శుక్రవారం ఎపిసోడ్


బాబుని ఆడిస్తున్న హిమ-శౌర్య.... వీడిపేరు..తాతయ్య పేరు ఒక్కటే కదా అంటారు. ఆ మాటలు విన్న దీప..మోనిత తన కొడుక్కి ఆనందరావు అని పేరు పెట్టిన విషయం తల్చుకుంటుంది. మరోవైపు మోనిత ఫోన్లో బాబుని ఎత్తుకెళ్లిన కోటేష్ ఫొటో చూస్తూ...రోడ్డు పక్కన కారులో బాబుని వదిలేసి వెళితే బాధ్యత అనిపించుకుంటుందా అన్న సౌందర్య  మాటలు గుర్తుచేసుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన లక్ష్మణ్ కి ఫొటో చూపించి వీడిని వెతికి పట్టుకోవాలి ఎంత డబ్బు ఖర్చు అయినా ఇస్తానంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నమాటకు ఫైర్ అయిన మోనిత.. నీకు కృతజ్ఞత లేదు అంటుంది. మీ ఆవిడకు ట్రీట్మెంట్ చేసి ఫీజు తీసుకోవడం మరిచిపోయాను లక్షన్నర తీసుకొచ్చి ఇవ్వు అంటుంది. 


Also Read: రుద్రాణి ఆగడాలకి సౌందర్య చెక్ పెట్టనుందా.. దీప-కార్తీక్ ఇప్పుడేం చేయబోతున్నారు
హోటల్లో నిద్రపోతున్న అప్పారావుని నిద్రలేపిన దీప టైమెంతయిందో చూడు..కిచెన్లో పనిచేసే వెంకటమ్మ ఈరోజు రానంది నువ్వు సాయం చేయి అంటుంది. ఆశ్రమానికి పార్సిల్ మనం తీసుకెళదామా అంటే అక్కడంతా ఉడకబెట్టిన కూరగాయలే కదా తింటారు అంటాడు అప్పారావు. అటు ఇంట్లో పిల్లలకు టిఫిన్ తనిపిస్తున్న కార్తీక్ తో ...డాడీ అమ్మ పొద్దున్నే నిద్రలేచి వెళుతోంది కదా అంటే పొద్దున్నే నిద్రలేవడం మంచి అలవాటు, కొన్ని అలవాట్లు చేసుకోవాలి అంటాడు. అమ్మ అలా పనిచేస్తూనే ఉంటుంది అమ్మకి నిద్ర సరిపోతుందా అని అడిగిన సౌర్య మాటలతు.. ఒకప్పుడు వంట చేయొద్దని దీపకి నేనే చెప్పి ఇప్పుడు నేనే వంటలకు పంపిస్తున్నా అని బాధపడతాడు. నానమ్మ,తాతయ్య, దీపు అంతా ఎలా ఉన్నారో ఏమో అంటారు పిల్లలు. వాళ్లను బాధపెట్టడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు..వాళ్లను కూడా ఇక్కడకు రమ్మంటే బావుంటుంది కదా అంటారు. ఇంతలో వచ్చిన మహాలక్ష్మితో దీప వచ్చే వరకూ బాబుని చూసుకో అని కార్తీక్ అడుగుతాడు. 


Also Read: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా.. గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్..
రుద్రాణి తన దగ్గరున్న రౌడీని పిలిచి చెప్పిన పని చెప్పినట్టు చేయి అంటూ ఓ మాట చెబుతుంది. దీపా నీకు వేరే దారి లేదు నీ దారులన్నీ మూసేస్తున్నాను ఈ రుద్రాణి నుంచి తప్పించుకోలేవు దీపా అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు ఈ రోజు లేటైంది అనుకుంటూ దీప ఫాస్ట్ గా నడుస్తూ వెళుతుంటే.. వెనుకే పరిగెత్తుకొచ్చిన అప్పారావు మర్చిపోయావంటూ ఏదో కవర్ తీసుకొచ్చి ఇస్తాడు. బావ ఏం చేస్తాడు, ఏం చదివాడు, ఎలా ఉంటాడు అని వరుస క్వశ్చన్స్ వేస్తూ బావని కూడా తీసుకురా నీరు తోడుగా ఉంటాడని అనగానే దీప ఫైరవుతుంది. ఆ తర్వాత ఓ రోజు ఇంటికి భోజనానికి రా అనేసి చెప్పేసి అప్పారావును పంపించేస్తుంది. 


Also Read: వసుకి మరోసారి బాధ్యత గుర్తుచేసిన మహేంద్ర, జగతి-రిషి మధ్య దూరం తగ్గుతుందా పెరుగుతుందా.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
కట్ చేస్తే కాసేపు కారులో బయటకు వెళతారు సౌందర్య, ఆనందరావు..కాఫీ తాగేందుకు కార్తీక్, దీప పనిచేస్తున్న హోటల్ దగ్గర ఆగుతారు. హోటల్ బయట నిల్చున్న అప్పారావు..కార్తీక్ తో అక్క ఏం చేస్తోంది, పిల్లలు ఎంతమంది అంటాడు. ఇద్దరు పిల్లలు అని చెబుతాడు కార్తీక్. మరోవైపు హోటల్లో కాఫీ తాగినట్టు ఆశ్రమంలో చెప్పొద్దు అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన అప్పారావు ఓవరాక్షన్ చేస్తుంటే...మనం తెలుగులో మాట్లాడుకుందామా అంటుంది సౌందర్య. మీతో మాట్లాడటం కష్టం అన్న అప్పారావుతో సరిగ్గా మాట్లాడకపోతే ఇంతే అంటుంది సౌందర్య. మీలాగే ఓ మేడం వచ్చింది..చాలా ఫాస్ట్... ఆమె సినిమా హీరోయిన్ అనుకున్నా కానీ డాక్టర్ అంట..ఆమె భర్త కూడా డాక్టర్ అని చెప్పిందని అప్పారావు సౌందర్యతో చెబుతాడు. అదే సమయానికి కాఫీ తీసుకొచ్చిన కార్తీక్ తల్లిదండ్రులను చూసి షాక్ లో ఉండిపోతాడు..


Also Read: సౌందర్య, ఆనందరావు దగ్గరకు కార్తీక్.. దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణి ఇంటికి కోపంగా వెళుతుంది దీప. తప్పుచేశావ్ అని అరిస్తే..ముందు డబ్బులిచ్చి ఆ తర్వాత బాబుని తీసుకెళ్లమని చెబుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే నీ పిల్లలు ఇద్దర్నీ ఎత్తుకొస్తా అంటుంది. రుద్రాణి గొడవ నెమ్మదిగా ముగింపు దశకు వచ్చేట్టే ఉంది...చూడాలి...


Also Read: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి