రుద్రాణి బారినుంచి పిల్లల్ని ఎలా రక్షించాలా అనే ఆలోచనలో పడింది దీప. అప్పు తీర్చడం కన్నా తీర్చకపోవడమే మంచిదని రుద్రాణి ఆలోచిస్తోంది...నా పిల్లలపై కన్నేసింది..ఈ విషయం డాక్టర్ బాబుకి చెప్పడం కన్నా చెప్పకపోవడమే మంచిదనుకుంటుంది. కట్ చేస్తే హోటల్లో అప్పారావు ఇవ్వాల్సిన పార్సిల్స్ గురించి కార్తీక్ కి చెబుతాడు. ఒకటి ప్రకృతి ఆశ్రమానికి మరొకటి రుద్రాణికి ఇచ్చిరావాలంటాడు. ఇండస్ట్రీలో నిర్మాతతో, తాడికొండలో రుద్రాణితో బాగుండాలంటారు. రుద్రాణి చాలా డేంజర్..డబ్బులిస్తే తీసుకో లేదంటే వదిలెయ్ అని అప్పారావు జాగ్ర్తత్తలు చెబుతాడు. అటు కార్తీక్ పార్సిల్స్ తీసుకుని వెళ్లగానే..హోటల్లోకి దీప ఎంట్రీ ఇస్తుంది. నీ పని అయిపోయింది కదా అక్క...ఇప్పుడెందుకు వచ్చావ్ అంటాడు. ఖాళీ సిలిండర్ తీసుకొస్తా గ్యాస్ కావాలని అడిగితే ఇప్పుడే బావకి మాటిచ్చా..ఈ ఒక్కసారీ సర్దుకో అంటాడు. 


Also Read: బస్తీలో జెండా పాతేసిన మోనిత, బాధలో కార్తీక్, దీప కథకు ఇక శుభం కార్డేనా... కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
వంటలక్క ప్రజావైద్యశాల
మోనిత ప్రేమ కథ విన్న పనిమనిషి ఏడుస్తుంటే కశ్చీఫ్ ఇస్తుంది మోనిత. ఎన్నో కథలు చూసాను, విన్నాను కానీ మీ కథలో ట్విస్టులు మామూలుగా లేవంటుంది. లవ్ స్టోరీస్ లో నంబర్ వన్ లవ్ స్టోరీ మీది అంటుంది. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ అన్న మోనిత.. ఎప్పటికైనా నా కార్తీక్ ని చేరుకుంటాను అంటుంది. ఈ మాత్రం విని ఇలా అయిపోతే ముందు ముందు జరిగేవాటిని చూసి బెదిరిపోతావేమో అంటుంది. 


Also Read: బస్తీవాసుల మనసు గెలుచుకున్న మోనిత, ఆవేదనలో డాక్టర్ బాబు.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
ప్రకృతి వైద్యశాలకు భోజనం తీసుకెళ్లిన కార్తీక్ లోపలకు వెళుతుండగా... రూమ్ లో కూర్చున్న ఆనందరావు, సౌందర్య మాట్లాడుకుంటూ ఉంటారు. వెళ్లి గోరువెచ్చని నీళ్లు తీసుకొస్తా అంటుంది సౌందర్య. ఇంతలో లోపలకు వెళ్లి కార్తీక్ ఎవరో భోజనం ఆర్డర్ చేశారని అడుగుతాడు..కొత్తగా వచ్చిన వాళ్లే అయి ఉంటారన్న అక్కడ పనిచేసే వ్యక్తి సౌందర్య-ఆనందరావు ఉన్న రూమ్ చూపిస్తాడు. రూమ్ లోకి వెళ్లిన కార్తీక్ మంచంపై నిద్రపోతున్న తండ్రిని చూసి షాక్ అవుతాడు. అన్నీ ఉండి ఏమీలేనట్టు ఇక్కడ చేరారా అని బాధపడతాడు. సౌందర్య రావడం తెలిసి డోర్ వెనుక దాక్కుంటాడు. 
టేబుల్ పై భోజనం పార్సిల్ చూసిన సౌందర్య ... ఆనందరావుని నిద్రలేపుతుంది. దిక్కులేని వాళ్లలా ఇక్కడ చేరితే నేను భోజనం తీసుకొచ్చానా అనుకుంటాడు కార్తీక్. 


Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని ... వసు మాటలకి ఉప్పొంగిన రిషి మనసు.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
మరోవైపు ఆకలిగా లేదు సౌందర్య  అన్న ఆనందరావు.....భోజనం చేస్తుంటే నాకు పెద్దోడే గుర్తొస్తున్నాడు...ఇన్నాళ్లూ రుచికరమైన భోజనం చేస్తూ నీడపట్టున హాయిగా ఉన్నాం.. ప్రతి ముద్దా తినబోతూ నా కొడుకు తిన్నాడో లేదో, నా మనవలు, దీప తిన్నారో లేదో అనిపిస్తోంది..అందుకే భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను..ఏంటి మన జీవితాలు ఇలా అయిపోయాయి...పెద్దోడు ఇంతపని చేస్తాడనుకోలేదు ..వెళ్లాడే అనుకో నాకిక్కడ ఉండాలని అనిపించడం లేదు కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లొస్తానని చెప్పి ఉంటే ఇంత బాధపడేవాడిని కాదంటాడు. కార్తీక్ మనల్ని వెతుక్కుంటూ వస్తాడన్న సౌందర్య మాటలకు మళ్లీ స్పందించిన ఆనందరావు..నాకు ఆ నమ్మకం లేదు.. ఏధైనా జరగరానిది జరిగి నా ప్రాణాలు పోతే నాకు చివరి కర్మలకైనా వస్తాడో లేదో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. 


Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
కట్ చేస్తే రుద్రాణి పంపిన క్యారియర్ స్కూల్ కి తీసుకొచ్చిన ఆమె మనుషులు ఈ రోజు పిల్లలతో ఎలాగైనా క్యారియర్ తినిపించాలని అనుకుంటారు. ఆ క్యారియర్ తీసుకున్న హిమ, శౌర్య.. స్కూల్లో పిల్లలందరకీ ఆ భోజనం పెట్టేసి.. రుద్రాణి మనుషులు చూడకుండా ఇంటికి వెళ్లిపోతారు. ఎపిసోడ్ ముగిసింది.. 


రేపటి ఎపిసోడ్ లో
రుద్రాణిని కొట్టిన మహానుభావురాలు ఎవరో కానీ ఆవిడ ఇక్కడకు మనశ్సాంతికోసం వచ్చి ఉంటారనుకుంటూ ప్రకృతి వైద్యశాలలోకి ఎంట్రీ ఇస్తుంది దీప. రుద్రాణి లాంటిదాన్నే కొట్టిందంటే ఆవిడ దర్శనం చేసుకుని దణ్ణం పెట్టుకున్నా చాలనుకుంటుంది. రూమ్ లో సౌందర్య, ఆనందరావుని చూసి షాక్ తిన్న దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది...


Also Read: ఐ లవ్ యూ సర్ అన్న వసుధార.. షాక్ లో రిషి, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి