కార్తీకదీపం జనవరి 15 శనివారం ఎపిసోడ్..


గత ఎపిసోడ్‌లో మోనిత హోటల్‌కి వచ్చిందని చెప్పిన కార్తీక్ మనం జాగ్రత్తగా ఉండాలంటాడు. స్పందించిన దీప కూడ ఎక్కువగా బయట తిరగొద్దంటుంది. మరోవైపు బస్తీలో లక్ష్మణ్ భార్య చావుబతుకుల మధ్య ఉంటే మోనిత వైద్యం చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్స్ ఇవే.. ఈ రోజు (శనివారం) ఎపిసోడ్ లో కార్తీక్ పిల్లలకు టిఫిన్ పెడుతూ.. ‘మీరు బాగా తినాలమ్మా.. మీరు హ్యాపీగా ఉండాలి.. అప్పుడే నేను అమ్మా సంతోషంగా ఉండగలం’అంటాడు. మీకు మేము ఎలాగో నాన్నమ్మ తాతయ్యలకు నువ్వు అలాగే కదా.. మరి వాళ్లు నీకు గుర్తు రావట్లేదా? నువ్వు వదిలి వచ్చేస్తే వాళ్లు బాధపడరా’ అంటూ ప్రశ్నలు వేయడంతో కార్తీక్ బాధపడతాడు. పిల్లలకు ఏదో సర్దిచెప్పి స్కూల్ కి పంపిస్తాడు 


Also Read: బస్తీవాసుల మనసు గెలుచుకున్న మోనిత, ఆవేదనలో డాక్టర్ బాబు.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
కట్ చేస్తే బస్తీలో మోనిత కాళ్లపై పడతారు లక్ష్మణ్, లక్ష్మణ్ భార్య. ‘మమ్మల్ని క్షమించండి.. మీరెంత మంచి వాళ్లో అర్థం చేసుకోలేకపోయాం... ఇన్నాళ్లు ఎన్నో మాటలు అన్నాం.. ఇక మీదట మీకు ఏ అవసరం అయినా మేము వస్తాం..’ అంటూ నమస్కారం చేసి ప్రేమగా మాట్లాడి వెళ్లిపోతారు. దాంతో నవ్వుకున్న మోనిత.. ‘దీపక్కా నీ ఫ్యాన్స్ అంతా నా ఫ్యాన్స్ అయిపోతున్నారు’ అనుకుంటుంది. 


Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
మరోవైపు రుద్రాణి.. దీప వంటగదిలో వంట చేసుకుని వెళ్తూ ఇచ్చిన వార్నింగ్ గురించి తలుచుకుని రగిలిపోతుంటుంది.  ఇంట్లోంచి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన రౌడీతో ఇదెక్కడిది అంటుంది. ఇంట్లో పెట్టానని చెప్పడంతో విసిరికొట్టి వాడ్ని లాగిపెట్టి కొడుతుంది. ఆ వంటగదిని వాడొద్దని క్లోజ్ చేయమని చెప్పాకదా అంటుంది.  ఆ వంట గదిని చూస్తుంటే నాకు ఆ దీప ధైర్యమే గుర్తొస్తుంది.. ఆ వంటగది మైలు పడిపోయింది.. ఈ రోజు నుంచి ఆ రంగరాజు(ఆనంద్), ఆ పిల్ల హిమ మనింటికి వచ్చే వరకూ వంట చేయొద్దు.. హోటల్ నుంచి తేవాలి’ అంటుంది రుద్రాణి.. ‘అదేంటక్కా ఇకప్పుడు పిల్లలు లేరని బాధపడేదానివే కానీ.. పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకోలేదుగా?’ అంటాడు ఆ గడ్డం రౌడీ అయోమయంగా. ‘అవునురా.. కానీ ఆ రంగరాజుకి వెనుక వీపు మీద పుట్టుమచ్చ చూశావా..? అలా ఉంటే మహారాజు యోగం తెలుసా.. ఇక ఆ పిల్లల్లో హిమని చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తోంది.. అందుకే ఆ ఇద్దరూ నాకు కావాలి. ఆ మొగుడు పెళ్లాం వాళ్ల పిల్లల్ని నాకు దత్తత ఇచ్చి తీరాలి. వెళ్లు వెళ్లి నాకు కాఫీ తీసుకురా’ అని అరుస్తుంది రుద్రాణి. దాంతో తలగోక్కుంటూ.. ‘ఏంటో అక్క.. అర్థమే కాదు’అని నసుక్కుంటూ వెళ్తాడు .  ‘దీపమ్మా నీ కథకి శుభం కార్డు నేను ఇస్తానమ్మా..’ అంటూ రుద్రాణి తనలో తనే రగిలిపోతుంది.


Also Read: ఐ లవ్ యూ సర్ అన్న వసుధార.. షాక్ లో రిషి, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
పిల్లలు వెళ్లాక ఒంటరిగా కూర్చుని తల్లిదండ్రుల పిలుపు తలుచుకుని బాధపడుతుంటాడు కార్తీక్. అక్కడకు వచ్చిన దీపతో...  ‘నా కారణంగా ఎంతమంది బాధపడుతున్నారో చూడు దీపా’ అని బాధపడతాడు. పిల్లల్లో కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయని...వాళ్లు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదంటాడు. ఇంకా పడిన కష్టాలు, మోనిత గురించి తల్చుకుని బాధపడతాడు.  దీప ఓదార్చేందుకు ప్రయత్నించినా ఏమీ పట్టనట్టు వెళ్లిపోతాడు. మరోవైపు కార్తీక్ పనిచేసే హోటల్‌లో అప్పిగాడు మోనితతో దిగిన ఫొటోని చూసుకుంటూ మురిసిపోతూ.. కార్తీక్‌కి చూపిస్తాడు. ‘కన్నడ హీరోయిన్ అని ఇక్కడ పెద్ద పోస్టర్ వేయిస్తే ఎలా ఉంటుందంటావ్.. అప్పుడు అప్పిగాడి రేంజే వేరు అనుకుంటారు అంతా కదా’అని బిల్డప్ ఇస్తారు. ఎప్పటికైనా నేను స్టార్ అవుతా, స్టార్ హోటల్ కడతా..అందులో కూడా ఇదే పోస్ట్ ఇవ్వవు కదా అంటాడు. నువ్వు కూడా కొంచెం అందంగా ఉంటావ్ ఆర్టిస్టుగా ట్రై చేయొచ్చుకదా అంటాడు అప్పిగాడు. అటు కార్తీక్ మాత్రం మోనిత దారుణాలు గుర్తుచేసుకుని బాధపడతాడు. ఫొటోని తెగ చూస్తున్నావ్ ..పడిపోయావ్ కదూ..మీ ఇద్దరి జోడీ సూపర్ ఉంటుంది అన్న మాటలు విని కార్తీక్ షాక్ గా చూస్తూ ఉండిపోతాడు. అటు దీప రుద్రాణి మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంటుంది... ఎపిసోడ్ ముగిసింది


సోమవారం ఎపిసోడ్ లో
ప్రకృతి వైద్యశాలకు హోటల్ నుంచి పార్సిల్ తీసుకెళ్లిన కార్తీక్..తల్లిదండ్రులను అక్కడ చూస్తాడు. నాకేదైనా జరగరానిది జరిగితే చివరి కర్మలకైనా అని కన్నీళ్లుపెట్టుకుంటున్న తండ్రిని చూసి డాక్టర్ బాబు చలించిపోతాడు..మరోవైపు ప్రకృతి వైద్యశాల చూసి దీప ఆగుతుంది...అంటే సోమవారం ఎపిసోడ్ మొత్తం ప్రకృతి వైద్యశాల చుట్టూనే తిరుగుతుందన్నమాట...


Also Read:  రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్