Gold Silver Price Today 15 January 2022: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర పడిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,100గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,900కి దిగొచ్చింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర నిన్న సాయంత్రం రూ.200 మేర పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,000కు చేరుకుంది. వెండి 1 కిలోగ్రాము ధర రూ.65,900 వద్ద మార్కెట్ అవుతోంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.51,440 అయింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,150 కు ఎగబాకింది. ముంబయిలో 22 క్యారెట్లపై రూ.120 మేర తగ్గడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.46,980 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.260 పెరగడంతో తులం ధర రూ.45,450 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,590 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.
తగ్గిన ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర వరుసగా మూడోరోజు పెరిగింది. నేడు రూ.8 మేర పెరగడంతో నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.23,210 అయింది. ఢిల్లీలో, చెన్నైలో 10 గ్రాముల ధర రూ.23,220 గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,110 వద్ద మార్కెట్ అవుతోంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం
Also Read: Bandi Sanjay: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలి