విశ్వ వేదికపై దాయాది పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం మరోసారి లభించింది! ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022లో టీమ్‌ఇండియా తన తొలి పోరులో పాకిస్థాన్‌ను ఢీకొట్టబోతోంది. యాదృచ్ఛికంగా ఈ రెండు జట్లకు మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ ఇదే కావడం ప్రత్యేకం.
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ షెడ్యూలును ఐసీసీ ప్రకటించింది. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టోర్నీ జరుగుతుంది. మొదట గ్రూప్ ఏ, గ్రూప్ బి మధ్య అర్హత పోటీలు జరుగుతాయి. ఇందులో వెస్టిండీస్, శ్రీలంక ప్రధాన జట్లుగా ఉన్నాయి. నేరుగా అవి సూపర్ 12కు అర్హత సాధించకపోవడంతో ఇందులో తలపడుతున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో మొత్తం ఎనిమిది జట్లు తలపడతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు 12కు చేరుకుంటాయి.
ఇక సూపర్ 12 జట్లను గ్రూప్ 1, గ్రూప్ 2గా విభజించారు. మొదటి గ్రూపులో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్ ఏ విజేత, గ్రూప్ బి రన్నరప్ ఈ బృందంలోకి వస్తారు. ఆసీస్ x ఇంగ్లాండ్, ఆసీస్ x న్యూజిలాండ్ పోరాటలు ఆసక్తికరంగా సాగనున్నాయి. గ్రూప్-2లో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్-బి విజేత ఇందులోకి వస్తారు. భారత్, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ తెలిసిందే.
గతేడాది ఏడాది దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఘోరంగా విఫలమైంది. మొదటి మ్యాచులో పాకిస్థాన్‌త తలపడి అవమానకరంగా ఓడిపోయింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 23న దాయాదులు ప్రపంచకప్ మొదటి మ్యాచులో తలపడతారు. మరి రోహిత్ సేన విజయంతో బోణీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ మ్యాచులు
23 అక్టోబర్ - భారత్ vs పాకిస్థాన్ @ మెల్‌బోర్న్ (MCG)
27 అక్టోబర్ - భారత్ vs అర్హత జట్టు @ సిడ్నీ (SCG)
30 అక్టోబర్ - భారత్ vs దక్షిణాఫ్రికా @ పెర్త్ (WACA)
2 నవంబర్ - భారత్ v బంగ్లాదేశ్ @ అడిలైడ్ ఓవల్
6 నవంబర్ - భారత్ vs అర్హత జట్టు @ మెల్‌బోర్న్ (MCG)
Also Read: IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్ సై..! లేదంటే ఓటమి బాటే!!
Also Read: IND vs WI Reschedule: విండీస్ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్, కోల్‌కతాల్లోనే మ్యాచులు!
Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!