పుష్ఫ ఫీవర్ సెలబ్రిటీలను ఇప్పుడే వదిలేలా లేదు. రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఇటీవలే పుష్పకు సంబంధించిన వీడియోలు చేశారు. ఇక డేవిడ్ వార్నర్ అల వైకుంఠపురంలో టైం నుంచే అల్లు అర్జున్‌ను ఫాలో అవ్వడం ప్రారంభించాడు. మొదటి లాక్ డౌన్ సమయంలోనే డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరించాడు.
ఇప్పుడు మరో వీడియోను కూడా డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశాడు. పుష్పలోని ఎంతో ఫేమస్ ‘శ్రీవల్లి’ స్టెప్‌తో డేవిడ్ భాయ్ ఫ్యాన్స్‌ను మరోసారి ఫిదా చేశాడు. అయితే సాధారణంగా డేవిడ్ వార్నర్ ఎప్పుడూ తెలుగు వెర్షన్‌నే ఎంచుకుంటాడు. కానీ శ్రీవల్లి సాంగ్‌కు మాత్రం ఈసారి కన్నడ ఆడియోతో ఈ వీడియోను విడుదల చేశాడు.
డేవిడ్ వార్నర్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి వేలంలో పోటీ పడనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి తగినట్లు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల మధ్య కూడా ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. ఈ వార్తలు నిజం అవుతాయో లేకపోతే వార్నర్‌ను మరో ఫ్రాంచైజీ ఎగరేసుకుపోతుందో వేచి చూడాలి మరి!
Also Read: IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్ సై..! లేదంటే ఓటమి బాటే!!
Also Read: IND vs WI Reschedule: విండీస్ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్, కోల్‌కతాల్లోనే మ్యాచులు!
Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!