2022 జనవరి 22 శనివారం రాశిఫలాలు


మేషం
మేషరాశి వ్యాపారులకు ఈ రోజు అంతగా కలసిరాదు. ఉద్యోగులకు అంతంతమాత్రమే, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచండి. ఆర్థరైటిస్‌ రోగుల సమస్య పెరగవచ్చు. అనుకున్న పనులన్నీ పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. 


వృషభం
ఈ రోజంతా హెచ్చుతగ్గులుగా ఉంటుంది. శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. పనిచేసే ఓపిక తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామిపై నమ్మకం ఉంచండి. ఇనుము వ్యాపారులకు సవాలుగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించండి. ప్రభుత్వ పనుల్లో ఇబ్బంది ఉంటుంది.


మిథునం 
ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగబాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా అధిగమిస్తారు. తలనొప్పితో బాధపడతారు. 


Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!
కర్కాటకం
ఎవరితోనైనా వివాదాలు రావచ్చు. మీ మాటలు మీ జీవిత భాగస్వామిని బాధించవచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అతి విశ్వాసంతో ఏ పనీ చేయవద్దు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటే పరిస్థితులు విపరీతంగా ఉంటుంది.


సింహం
ఉద్యోగం మారాలి అనుకున్నవారికి ఇదే సరైన సమయం. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. రోజు ప్రారంభం చాలా బావుంటుంది. మేధావుల సహవాసం వల్ల ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. 


కన్య 
తియ్యని మాటలు నమ్మి మోసపోతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సమయం చాలా ప్రతికూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మీ మూడ్ బాగానే ఉంటుంది. ఆగిపోయిన పనులు కొనసాగిస్తారు. పెద్దలపట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. 


Also Read: తుమ్ము మంచి శకునమే కానీ షరతులు వర్తిస్తాయట..
తుల
కుటుంబం పట్ల ఆందోళన ఉంటుంది. ఆస్తి విషయంలో పెద్దగా రాజీ పడకండి. పరిచయాలు పెరుగుతాయి. కొనని పాత విషయాలపై సన్నిహితులతో వివాదాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనకు విరుద్ధమైన చర్యల వల్ల మీ మనస్సు కలత చెందుతుంది. 


వృశ్చికం
విద్యార్థులు పరీక్షల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. మీ పరపతి పెరుగుతుంది. ఊహించని బహుమతి అందుకోవచ్చు. ఇంటి సభ్యులతో సంతోషంగా ఉంటారు. 


ధనుస్సు 
తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అహంకారం మరియు కోపం కారణంగా, మీ పని చెడిపోవచ్చు. మీ ఉన్నతాధికారి మీపై నమ్మకంతో లేరు..పని విషయంలో జాగ్రత్త వహించండి. మీరు చేసే పనిపట్ల పూర్తి బాధ్యతగా ఉండండి. మీప్రతి పనిలోనూ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. 


Also Read:  కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
మకరం
ఖర్చులపై కాస్త అవగాహన కలిగి ఉండాలి. కుటుంబ సమస్యలపై వాదోపవాదాలు ఉండొచ్చు. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్యతో బాధపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


కుంభం
 కొత్తగా చేపట్టే పనుల గురించి కొంత ఎంక్వరీ చేయండి. వివాహ సంబంధాలతో కొంత విసుగు చెందుతారు. పాత చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని బాధపెడతాయి. మీ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించండి. 


మీనం
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కార్యాలయంలో మహిళా సహోద్యోగితో విభేదాలు రావచ్చు. దిగుమతి-ఎగుమతి సంబంధిత వ్యాపారం పెరుగుతుంది. కార్యాలయంలో బాస్ మీ పట్ల అసంతృప్తిగా ఉండొవచ్చు.


Also Read: పెళ్లయిన అమ్మాయిలు నల్ల పూసలు ఎందుకు వేసుకోవాలి? అవి లేకపోతే ఏమవుతుంది?
Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: అనారోగ్యం, శని ప్రభావం నుంచి విముక్తి పొందాలంటే ఈ ఆలయానికి వెళ్లాలట..
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి