పెళ్లయిన తర్వాత మంగళసూత్రం,  మెట్టెలు, నల్లపూసలు ధరించడం మన సాంప్రదాయంలో ఒక భాగం. వాస్తవానికి పెళ్లైన స్త్రీకి నిండుదనాన్ని తీసుకొచ్చేవి ఇవే. కానీ ప్రస్తత మోడ్రన్ సమాజంలో వాటిని ఫ్యాషన్ కి అడ్డంకిగా భావించి మొక్కుబడిగా వేసుకుని తీసి పడేస్తున్నారు. వాటిని కూడా ఆభరణాల్లా చూస్తున్నారు. కొందరిని చూస్తే కనీసం పెళ్లయిందో లేదో అని కూడా తెలియడం లేదు. అయితే ఈ ఆభరణాలు ధరించడం వెనుక ఒక్కోదానికి ఒక్కో కారణం ఉందంటారు పండితులు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆడవారు ధరించే ఆభరణాలు  వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయంటారు. స్త్రీ  సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన వాటినే ఆభరణాలుగా ఏర్పాటు చేసారు పెద్దలు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. 


Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!
అప్పట్లో నల్లపూసలను మట్టితో చేసేవారు. ఈ నల్లమట్టితో తయారు చేసిన పూసలు వేసుకోవడం వల్ల..ఆ పూసలు గుండెపై పడి శరీరంలో ఉన్న వేడిని లాక్కుంటాయి. మంగళ సూత్రాల్లో కూడా రెండు పెద్దపెద్ద నల్లపూసలు, ఎర్రపూసలు మట్టితో తయారు చేసినవి వాడడం వెనుక కూడా ఉద్దేశం ఇదే.  శరీరంలో వేడిని తగ్గించడం ద్వారా అనేక గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. పైగా మట్టితో చేసిన నల్లపూసల దండను వధూవరులతో నీలలోహిత గౌరీకి పూజ చేస్తారు. ఈ పూజ ద్వారా గౌరీదేవి అనుగ్రహం కలిగి ఆ దంపతులు జీవితాంతం సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. పైగా గౌరీ సన్నిధిలో నల్లపూసల దండకు పూజచేసి ధరించడం వల్ల వధూవరులకు సంబంధించి ఎలాంటి జాతక దోషాలైనా, సర్పదోషాలనై తొలగిపోతాయని చెబుతారు. 


Also Read: తుమ్ము మంచి శకునమే కానీ షరతులు వర్తిస్తాయట..
ప్రస్తుత కాలంలో మట్టితో తయారు చేసిన నల్లపూసలు కనుమరుగైపోయాయి. ప్రస్తుతం నగల దుకాణాల్లో దొరుకుతున్న రెడీమేడ్ పూసల్ని మంగళసూత్రం, నల్లపూసల్లో కూడా కాకుండా బంగారు దండలో వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలా  బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది.  ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంటుంది. గొంతుభాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంటుంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉన్న రోగాలు నయమవుతాయి. నల్లపూసల వల్ల కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్ ని మాత్రమే హృదయం స్వీకరిస్తుందని కూడా చెబుతారు. 


పాటించేవారికి ప్రతీదీ సెంటిమెంటే..పట్టించుకోనివారికి ప్రతి విషయం ట్రాషే... వేసుకుంటే మంచిదని పండితులు చెప్పిన మాట పాటిస్తారో, పాటించరో అన్నది పూర్తిగా మీకు సంబంధించిన విషయం. అంతేకానీ దీనిపై వితండవాదన అనవసరం...


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: అనారోగ్యం, శని ప్రభావం నుంచి విముక్తి పొందాలంటే ఈ ఆలయానికి వెళ్లాలట..
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి