ఎక్కడికైనా బయలుదేరేముందు ఎవరైనా తుమ్మితే చాలు...అపశకునం అని ఫీలైపోతారు. ఏపనిపై వెళదామనుకున్నారో ఆ పనికి ఆటంకాలు తప్పవని ఫిక్సైపోతారు. ఈ సెంటిమెంటి ఈ మధ్యకాలం నుంచి మొదలైందేం కాదు..ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో ఎందుకు అలా చెప్పారన్న విషయం పక్కనపెట్టి తమ్మితే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అంటూ జరుగుతున్న ప్రచారం ఏంటో చూద్దాం... 



  • ఒక తుమ్ము తుమ్మితే కీడు సూచిస్తుంది

  • రెండు తుమ్ములు తుమ్మితే ఏ పనిపై వెళుతున్నారో ఆ పని పూర్తైపోతుందట

  • ఎక్కువ తుమ్ములు తుమ్మితే అస్సలు బయలుదేరడం కూడా మంచిది కాదు

  • చేతిలో ఇనుము, వెండి పట్టుకున్న వారు తుమ్మితే వెళ్లిన పని పూర్తికాదు

  • కంచు, రాగి పట్టుకుని ఉండగా తుమ్మితే ఆ సమయంలో ఏ పనిపై బయలుదేరి వెళ్లినా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తైపోతుందట.

  • ఉదయం లేవగానే తుమ్మితే శుభం

  • నీటిదగ్గర, ఎవరితోనైనా గొడవ జరుగుతున్నప్పుడు, పదిమందిలో తుమ్మిదే అవమానం ఎదుర్కోవడంతో పాటూ  జీవిత భాగస్వామికి కీడు జరుగుతుంది

  • పసిపిల్లలు, ఐదేళ్ల లోపువారు, వేశ్య, బాలింతరాలు తుమ్మితే అంతా మంచే జరుగుతుంది


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?



  • అంగవైకల్యం ఉన్నవారు తుమ్మిన తర్వాత బయలుదేరితే ఏ పని అయినా పూర్తైపోతుందట 

  • తమ్ము వినడమే కాదు ప్రయాణం చేసేవారు కూడా తుమ్ముతూ ప్రయాణం చేయరాదు

  • తుమ్మినవారు నేను గానీ, తలను గానీ గోకినా, విచారంగా ఉన్నా ప్రయాణం మానుకోవడం మంచిది

  • ముత్తైదువు, విధవ, గుడ్డిది, బిడ్డలులేని స్త్రీ తుమ్మినపుడు ప్రయాణం చేస్తే మరణం సంభవిస్తుందట

  • కుటిల స్వభావం ఉన్న స్త్రీ, మూగది, అంగవైకల్యం ఉన్న స్త్రీ తుమ్మితే ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిదంటారు.. లేదంటే కష్టాలు తప్పవట

  • నాలుగుకాళ్ల జంతువు ఎదురైనా, తుమ్మినా మంచిది కాదు..ప్రయాణం చేయడానికి సాహసించరాదు...

  • ఎవరైనా తుమ్మినపుడు బంగారం కానీ, ఆడవారి నాట్య భంగిమ, తాంబూలం వేసుకునే వారి ముఖం చేస్తే శుభం జరుగుతుందట...


Also Read: అనారోగ్యం, శని ప్రభావం నుంచి విముక్తి పొందాలంటే ఈ ఆలయానికి వెళ్లాలట..
తుమ్మితే ఎందుకు వెళ్లకూడదని చెబుతారంటే
అయితే పూర్వకాలం ఇంట్లో ఎవరైనా యాత్రలకు వెళితే కాలినడకన బయలుదేరేవారు. రోజుల తరబడి నడిచి వెళ్లి దైవదర్శనం చేసుకుని మళ్లీ ఇంటికి తిరిగొచ్చేవరకూ అప్పట్లో ఎలాంటి సమాచారం వ్యవస్థ ఉండేది కాదు. తుమ్ము అనారోగ్యానికి సూచన అనేవారు. అందుకే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తుమ్మితే ఆగమని చెప్పేవారు. ఎందుకంటే వెళ్లాల్సిన మనిషి వెళ్లిపోతే తుమ్మిన వ్యక్తికి ఆ తర్వాత ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఇంకేదైనా జరిగినా సమాచారం చెప్పే అవకాశం లేకపోగా..ఒక్కోసారి చివరి చూపు కూడా దక్కేదికాదు. అందుకే తుమ్మితే ప్రయామం వాయిదా వేసుకోమని చెప్పేవారని అంటారు. అలా అలా ఆ సెంటిమెంట్ బలపడి...ఇన్ని రకాల మొలకలు పుట్టుకొచ్చిందని చెబుతారు పండితులు. 


Also Read:  అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి