ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
నవగ్రహ శ్లోకాల్లో ఆదిలో ఉన్న ఆదిదేవుడి గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం... నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్ జగతికి వెలుగునించే ప్రత్యక్షదైవం సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలసి వెలసిన ప్రాంతమే కుంభకోణంలో సూర్యనార్ దేవాలయం. ఇక్కడ నవగ్రహాల్లో సూర్య భగవానుడిది కీలకస్థానం. ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహదోషాల నుంచి కూడా విముక్తి పొందచ్చంటారు పండితులు. సాధారణంగా నవగ్రహాల ఆలయంలో శివుడు ప్రధానంగా ఉంటే.. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ఉన్న సూర్యనార్ ఆలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం.
Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
చోళులు నిర్మిస్తే విజయనగర రాజులు అభివృద్ది చేశారు
సూర్యనార్ ఆలయాన్ని క్రీస్తుశకం 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించారు. ఈ ఆలయంలో ఇతర గ్రహాధిపతులకు ప్రత్యేకమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయక, మురుగన్ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయ మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మూలవిరాట్టు అయిన సూర్యభగవానుడు తన ఇద్దరు భార్యలతో భక్తులకు దర్శనమిస్తాడు. వాస్తవానికి సూర్యుడు తీక్షణమైన కిరణాలతో ఉంటే..ఇక్కడ స్వామివారు మాత్రం అందుకు భిన్నంగా మందహాసంతో రెండు చేతుల్లో తామరపూలు పట్టుకుని ఆశీర్వచనం అందిస్తున్నంటాడు. సూర్యఆలయం కావడంతో ఈ ఆలయం ప్రాంగణం మొత్తం వేడిగా ఉంటుందట. పరమశివుడికి ఎదురుగా నంది ఉన్నట్టే సూర్యుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. రథసప్తమి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారిక్కడ.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
స్థలపురాణం
కాలవముని అనే యోగి కుష్ఠువ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించాలని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు అనుగ్రహించిన గ్రహాధిపతులు కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ ఆగ్రహం వ్యక్తంచేసి...మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోనే శ్వేతపుష్పాల అటవీప్రాంతానికి వెళ్ళమని శపిస్తాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారుడైన పరమశివుని కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి చేస్తాడు. అంతేకాకుండా, వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదిస్తాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటే వారికి ఎలాంటి బాధల నుంచైనా ఉపశమనం లభిస్తుందని పరమేశ్వరుడు చెప్పాడట. అందుకే ఈ సూర్యనార్ ఆలయాన్ని దర్శించుకుంటే అన్ని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంటారంతా.
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
ఏలినాటి శని దోషం పోవాలంటే
కుజ దోషం, ఏలినాటి శనిదోషం, జాతకచక్రంలో రాహు,కేతు దోషాలు లాంటివి సూర్యనార్ ఆలయాన్ని దర్శించుకుని పూజిస్తే తొలగిపోతాయని పండితులు చెబుతారు. పరమేశ్వరుడి వర ప్రభావంతోనే ఈ ఆలయంలో ఇలా జరుగుతుందంటారు. సూర్యభగవానుడితో పాటు గురుడుని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఆలయానికి సమర్పించుకుంటారు. ఈ ఆలయంలో పూజ చాలా నిష్ఠగా ఉంటుంది. పూజానంతరం ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చెయ్యవలసి ఉంటుంది. సూర్య భగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా కూడా దానినే అందిస్తారు.
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి