Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇటీవల కొన్ని రోజులపాటు వర్షాలు కురవడమే అందుకు కారణం. తాజాగా ఏపీలో వాతావరణం పొడిగా మారనుంది. వర్షాలు తగ్గినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత తగ్గడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర దిశ నుంచి బలమైన గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది. తెలంగాణలో అకాల వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్, పలు జిల్లాల్లో చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది.
ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలు తగ్గడంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందనక్కర్లేదని సూచించారు. కళింగపట్నం, నందిగామలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది.
రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం తగ్గినట్లు కనిపించడం లేదు. ఉదయం వేళ కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య