రోజూ ఇంటి పనులు చూసుకొనే సాధారణ గృహిణి అపర కాళిలా వ్యవహరించింది. భర్తకు అపాయం తలెత్తిన వేళ కంగారు పడిపోకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించి అతణ్ని కాపాడుకుంది. నలుగురు పురుషులు అనుమానాస్పదంగా ఇంట్లోకి చొరబడి భర్తపై దాడి చేస్తుంటే ఎంతో తెలివిగా ప్రవర్తించి మాంగల్యాన్ని కాపాడుకుంది. ఆమె ధైర్యానికి స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.


పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలోని శంభుని పేటలో వేముల భూపాల్, కల్యాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వేముల భూపాల్ ‘ది వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్’కు అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే, ఆ సంఘానికి అధ్యక్షుడైన ఈయనకు గతంలో ఎవరితోనూ వివాదాలు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈయన్ను చంపేందుకు బుధవారం అర్ధ రాత్రి ఆటోలో నలుగురు అపరిచిత వ్యక్తులు భూపాల్ ఇంటికి వచ్చారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు భూపాల్‌ ఇంటిలోకి చొరబడి భూపాల్ కోసం వెతికారు. ఆయన కనిపించగానే ఏ మాత్రం ఆలోచించకుండా కత్తులతో దాడి చేయడం మొదలు పెట్టారు.


Also Read: కన్నా లక్ష్మీ నారాయణకి కోర్టులో చుక్కెదురు, కోడలు వేసిన పిటిషన్ వల్లే.. ఆమెకు కోటి చెల్లించాల్సిందేనని తీర్పు


ఇది చూసిన భూపాల్ భార్య కల్యాణి ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే తేరుకొని తెలివిగా ఆలోచించింది. వెంటనే వంట గదిలోకి వెళ్లి గుప్పెడు కారం పొడి తీసుకొచ్చి ఆ ముగ్గురు దుండగుల ముఖాల మీద ధైర్యంగా కొట్టింది. అంతేకాక, కాపాడండి అంటూ అందరికీ వినిపించేలా పెద్దగా కేకలు వేసింది. దీంతో అప్పటికే కళ్లు విపరీతంగా మండుతున్న వారు.. ఆందోళన పడిపోయి నిందితులు ముగ్గురూ ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించారు. ఆమె అరుపులు విని పక్కనే ఉండే భూపాల్‌ సోదరుడు క్రాంతి కుమార్‌ ఆ ఇంటికి చేరుకున్నాడు. 


కళ్లల్లో కారం ఎక్కువగా పడడంతో ఎక్కడికీ కదల్లేని స్థితిలో ఉన్న రంజిత్‌ అనే వ్యక్తి వారికి దొరికిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని వారికి అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దొరికిపోయిన రంజిత్‌ను విచారణ జరపగా.. భూపాల్‌, క్రాంతి కుమార్‌ సోదరులతో ఉన్న భూముల విషయంలో ఉన్న గొడవల వల్లే ప్రత్యర్థులు ఆ హత్య చేసేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు వెల్లడించారు.


Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన


Also Read: Chittoor: భర్తను చంపి తలను సంచిలో పెట్టుకున్న భార్య.. వెంటనే ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లిందంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి