కరోనా థర్డ్ వేవ్ మొదలయింది. తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా రోజువారీ కొత్త కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండడం కాస్త ఊరట కలిగిస్తున్నందున వైరస్ సోకిన చాలా మంది ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే, ఇలా ఐసోలేషన్‌లో ఉండేవారు ఎలాంటి మందులు వేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. దాన్ని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్వీట్ చేసింది.


దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా బారిన పడ్డ వారు హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. మరీ లక్షణాలు తీవ్రంగా ఉండి, ఊపిరి ఆడని పరిస్థితి ఉంటేనే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తాజాగా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారు వినియోగించాల్సిన మెడిసిన్ లిస్ట్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ‘‘దయచేసి గమనించండి! ఇంటి వద్ద ఐసోలేశన్ లో ఉన్న కోవిడ్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహాతో వాడవలసిన మందులు ఇవి. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వలన ఈ తాజా సమాచారం ఉపయోగించగలరు’’ అని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్వీట్ చేసింది.


ఉదయం, రాత్రి వేసుకోవాల్సిన మందుల జాబితా ఇదీ.. అజిత్రోమైసిన్ (యాంటిబయాటిక్) ఉదయం ఐదు రోజుల పాటు వాడాలి. పారాసిటమాల్ (జ్వరం) ఉదయం, రాత్రి ఐదు రోజుల పాటు వేసుకోవాలి. లెవోసెటిరిజైన్ (జలుబు, దగ్గు) రాత్రి ఐదు రోజుల పాటు వేసుకోవాలి. రానిటిడైన్ (ఎసిడిటి) ఉదయం వేసుకోవాలి. ఇమ్యూనిటీ కోసం విటమిన్ సి, మల్టీవిటమిన్, విటమిన్ డి మాత్రలు ఉదయం 5 రోజుల పాటు వేసుకోవాలి’’ అని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.






Also Read: కన్నా లక్ష్మీ నారాయణకి కోర్టులో చుక్కెదురు, కోడలు వేసిన పిటిషన్ వల్లే.. ఆమెకు కోటి చెల్లించాల్సిందేనని తీర్పు


Also Read: Cocktail Injection: అప్పుడు రెమిడిసివిర్, ఇప్పుడు కాక్‌టైల్.. కరోనా సోకితే ఇది తప్పకుండా వాడాలా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి