చిత్తూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే మరోవైపు కోవిడ్ లక్షణాలతో ఉన్న రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాతావరణంలో మార్పులు కారణంగా విజృంభిస్తున్న జ్వరాలు ఒకవైపు, థర్డ్ వేవ్ లో కరోనా మరోవైపు పంజా విసురుతుంది. మొదటి, రెండో దశలో కోవిడ్ కారణంగా అనేక‌ మంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా, ఎన్నో కుటుంబాలను కరోనా వీధుల పాలు చేసింది. ఆసుపత్రుల్లో‌ బెడ్ లు ఖాళీ లేక, ఆక్సిజన్ అందుబాటులో లేక కోవిడ్ రోజులు అతలాకుతలం అయ్యారు. ఇటువంటి‌ సమయంలో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న వారికి రెమిడిసివిర్ ఇంజెక్షన్ తో‌ ప్రాణాలను కాపాడారు వైద్యులు. అయితే దీనినే ఆయుధంగా చేసుకున్న కొందరు మెడికల్‌ మాఫియా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ను డిమాండ్ క్రియేట్ చేసి వాటిని అధిక‌ ధరలకు విక్రయించే వారు.


మెడికల్ మాఫియా కొన్ని‌ ప్రైవేటు ఆసుపత్రులతో చేతులు కలిపి కోవిడ్ రోగులకు రెమిడిసివిర్ ఇంజక్షన్ అవసరం లేక పోయినా వాటిని రోగుల వద్ద కొనిపించి‌ డబ్బు దండుకునే వారు. ఈ‌క్ర మంలో మెడికల్‌ మాఫియాకు కళ్ళెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి‌ అవసరం అయితే గానీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఉపయోగించరాదని ప్రైవేటు ఆసుపత్రులకు నిబంధనలు పెట్టి ఇంజెక్షన్స్ పై ఖచ్చితమైన ధరను ప్రకటించింది. దీంతో కొంత‌మేరకు మెడికల్‌ మాఫీయా ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లు అయింది. అయితే థర్డ్ వేవ్ వ్యాప్తి నేపధ్యంలో మెడికల్ మాఫియా కాక్ టైల్ ఇంజెక్షన్ తెరపైకి తీసుకొచ్చింది. దీంతో కోవిడ్ సోకిన రోగులు కాక్ టైల్ ఇంజెక్షన్ కొనేందుకు ఉత్సహం చూపుతున్నారు. వ్యాధి సోకిన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కాక్ టైల్ ఇంజెక్షన్ ను వైద్యులు రెఫర్ చేస్తున్నారు. వేలకు వేలు అప్పు చేసి మరీ రోగులు కాక్ టైల్‌ ఇంజెక్షన్ ను కొంటున్నారు. కోవిడ్ సోకిందన్న భయంలో ప్రజలు కొందరు ప్రైవేటు వైద్యులు చెప్పిందల్లా చేస్తూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 


Also Read: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు


కాక్ టైల్ ఇంజెక్షన్ పై వైద్యులు ఏం అంటున్నారంటే..?
కరోనా వ్యాధి సోకిన‌ వ్యక్తికి అత్యవసర సమయాల్లో‌ మాత్రమే రెమిడిసివిర్ ‌ఇంజెక్షన్‌ వాడుతామని, అంతే‌కానీ సాధారణ‌ వ్యక్తులకు రెమిడిసివిర్, ‌కాక్‌టైల్‌ ఇంజెక్షన్ ‌వాడబోమని ప్రముఖ వైద్య నిపుణులు కిషోర్ కుమార్ అంటున్నారు. ప్రధానంగా వ్యాధి‌ సోకిన వారిలో‌ గర్బణీ స్త్రీలు గానీ, షుగర్, బీపీ, గుండెజబ్బులు వంటి వ్యాధులు ఉన్న వారికి రెమిడిసివిర్ ఇంజెక్షన్ గానీ, కాక్‌టైల్ ఇంజెక్షన్ గానీ రోగులకు ఉపయోగిస్తామని అంటున్నారు. అయితే థర్డ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చేందుతున్న క్రమంలో‌ కొందరు మెడికల్ మాఫియా ప్రైవేట్ ఆసుపత్రులతో చేతులు కలిపి కాక్‌టైల్ ఇంజెక్షన్ ను రోగుల వద్ద బలవంతంగా కొనేలా చేస్తున్నారని, యాంటీబాడీగా పనిచేసే కాక్ టైల్ ఇంజక్షన్ ఒక డోసు 60 వేల రూపాయలకు మార్కెట్లో లభిస్తోందని, రెండు డోసులు లక్షా ఇరవై వేల వరకు ధర ఉండడంతో కొందరు మెడికల్ మాఫీయా కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు. 


దీన్ని ఎవరూ నమ్మవద్దని ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి‌ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ఉపయోగించడం ద్వారా కరోనా వ్యాప్తిని కొంత వరకూ అడ్డుకట్ట వేసేందుకు వీలు అవుతుందన్నారు. ఎవరైనా కాక్ టైల్ ఇంజెక్షన్ తీసుకు‌రావాలని రోగులకు ఇబ్బందులకు గురి చేస్తే వారు‌ ప్రభుత్వ అధికారులకు గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు.


Also Read: Konchada Srinivas: ఆరోగ్య సమస్యలతో నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి


Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!



Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి