నటుడు కొంచాడ శ్రీనివాస్ బుధవారం మృతి చెందారు. ఆయన వయసు 47  ఏళ్లు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పట్టణం ఆయన స్వగ్రామం. ప్రతి సంక్రాంతికి సొంత ఊరు వెళ్లడం ఆయనకు అలవాటు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా సొంతూరు వెళ్లారు. అనారోగ్య సమస్యలతో అక్కడే తుదిశ్వాస విడిచారు.

కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అనూహ్యంగా కింద పడటంతో ఆయనకు ఛాతి మీద బలమైన దెబ్బ తగిలిందని సమాచారం. అప్పుడు ఆస్పత్రికి తీసుకువెళ్లగా... గుండెల్లో సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ సమస్య కారణంగా ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్రాంతి పండుగ కోసమని ఊరు వచ్చిన శ్రీ‌నివాస్‌కు మ‌రోసారి ఆరోగ్య సమస్య తలెత్తిందని, ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిసింది. కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 

కొంచాడ శ్రీనివాస్ రూపం, ముఖ్యంగా కళ్లు అతడిని అందరి మధ్య ప్రత్యేకంగా నిలిపాయి. ఆయనకు వేషాలు తెచ్చిపెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీస్', యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆది', 'ప్రేమ కావాలి' తదితర సినిమాలు చేశారు. సుమారు 40 సినిమాలు, పది సీరియళ్లలో ఆయన నటించారు.

కొంచాడ శ్రీ‌నివాస్‌కు త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఉన్నారు. తండ్రి ఐదు సంవత్సరాల క్రితం, తమ్ముడు పది సంవత్సరాల క్రితం మరణించారు. ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఇద్దరూ అత్తగారి ఇళ్లలో ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల చలన చిత్ర పరిశ్రమలో స్నేహితులు, సొంతూరి ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.


Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
Also Read: జనవరి 19 ఎపిసోడ్: వసుకి మరోసారి బాధ్యత గుర్తు చేసిన మహేంద్ర, జగతి - రిషి మధ్య దూరం తగ్గుతుందా? పెరుగుతుందా..? 'గుప్పెడంత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: జనవరి 19 ఎపిసోడ్: సౌందర్య, ఆనంద రావు దగ్గరకు కార్తీక్... దీప ఏం చేయబోతోంది...? 'కార్తీక దీపం' బుధవారం ఎపిసోడ్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి