2022 జనవరి 20 గురువారం రాశిఫలాలు
మేషంమీరు ముందుగా ప్లాన్ చేసుకున్న పనులు ఈ రోజు పూర్తిచేసుకోవచ్చు. చాలా రోజులుగా పనుల్లో వస్తోన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారస్తులకు మంచి రోజులొస్తాయి
వృషభంకారణం లేకుండా ఎవరిపైనా కోపం తెచ్చుకోకండి. మీరు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో సానుకూల మార్పులను చూస్తారు. ఎలాంటి బాధలనుంచైనా విముక్తి పొందగలుగుతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. మీరు మీ స్నేహితులతో సమయం గడపగలుగుతారు.
మిథునంఈ రాశికి చెందిన వారు ఈరోజు లాభం పొందుతారు. ఆగిపోయిన మొత్తాన్ని తిరిగి పొందడంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. మీరు మీ దినచర్యను మార్చుకోవడానికి ప్రయత్నించండి. కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..కర్కాటకంకొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తారు. తీసుకున్న అప్పు చెల్లించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ప్రత్యర్థి కారణంగా మీరు బాధపడవచ్చు. ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు తల లేదా కాళ్ళలో నొప్పితో బాధపడతారు.
సింహంబంధువులు రాకపోకలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు విద్యావంతుల మద్దతు పొందుతారు. మీ ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
కన్యఈరోజు అనవసరంగా కోపం తెచ్చుకోకండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందే సమయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు మీరు కోరుకున్న ఆహారాన్ని ఆస్వాదించగలరు.
Also Read: గ్లాసుడు నీళ్లు పోస్తే కరిగిపోయే బోళాశంకరుడుతుల మీరు కార్యాలయంలో పెద్ద బాధ్యతలను మోయవలసి ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులతో సమావేశం సందర్భంగా, మీరు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకుంటారు. పిల్లల వైపు విజయంతో సంతోషం ఉంటుంది.
వృశ్చికంవ్యసనాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఏదైనా పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లొచ్చు. స్నేహితుల పార్టీలు చేసుకుంటారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది.
ధనుస్సు విద్యార్థులకు నిపుణుల సహాయం అందుతుంది. ఆఫీసు పనులు పూర్తి చేయడంలో జాప్యం జరగవచ్చు. మీరు ఈరోజు ఈవెంట్‌కు హాజరు కావచ్చు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1మకరంఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త పనులు చేసే అవకాశం లభిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ మంచిది కాదు. శారీరక నొప్పితో పని ప్రభావితం కావచ్చు.
కుంభంచాలా కాలం తర్వాత ఈరోజు బంధువులు కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈరోజంతా ఆనందంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. అనవసర మాటలు కట్టిపెట్టండి.
మీనంఎవరి మీదా అనవసరంగా ఈర్ష్య పడకండి. ఈరోజు వ్యాపారంలో మందగమనం ఉండవచ్చు. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఈ రోజు ఏకాంతంలో ఉండాలనుకుంటారు. ఈరోజు సాధారణ రోజు అవుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2Also Read: ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..