స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లూ కన్ఫర్మ్ చేశారు. ఆమె చెల్లెలు నిషా అగ‌ర్వాల్‌ను 'మీ అక్క గర్భవతి కదా' అని అడిగితే... 'అవును' అన్నట్టు ఆనందంతో ముసిముసి నవ్వులు నవ్వారు. కాజల్ అగర్వాల్ కూడా బేబీ బంప్‌తో క‌నిపించారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌కు యాడ్ చేశారు. అయితే... ఆమె నేరుగా ఎక్కడా తాను ప్రెగ్నెంట్ అని చెప్పలేదు. ఇప్పుడు ఇలా కన్ఫర్మ్ చేశారని అనుకోవాలి.


పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ అగర్వాల్ కొత్త ప్రయాణం ప్రారంభించారు. ప్రెగ్నెంట్ లేడీస్ చేసే వ్యాయామాలు చేయడం స్టార్ట్ చేశారు. "prenatal journey (గర్భం దాల్చిన సమయంలో మహిళలు తీసుకునే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు) స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది" అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. సో... తాను ప్రెగ్నెంట్ అని ఆమె ఇలా చెప్పారని అనుకోవాలి.


ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందు మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', హిందీలో 'ఉమ' సినిమా షూటింగులు కాజల్ పూర్తి చేశారు. ప్రెగ్నెంట్ అని తెలిశాక... అప్పటికే అంగీకరించిన అక్కినేని నాగార్జున 'ద ఘోస్ట్' సినిమా నుంచి తప్పుకొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న 'ఆచార్య' విడుదల కానున్న సంగతి తెలిసిందే.






Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి