టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. తన పాత్ర కోసం విజయ్ చాలా కష్టపడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క సినిమా కోసం దాదాపు రెండేళ్ల సమయం కేటాయించారు విజయ్. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో విజయ్ ఒక్క సినిమా కోసం ఇంత టైం ఇవ్వడం మాములు విషయం కాదు.
అయితే ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు సినిమాకి పది కోట్లు తీసుకున్న విజయ్.. 'లైగర్' కోసం రూ.20 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. లాభాల్లో వాటా కూడా ఉందట. ఇలా లాభాల్లో షేర్ కేవలం స్టార్ హీరోలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు విజయ్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయారు. ఈ సినిమాపై విజయ్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయ్‌లాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ ఎంట్రీ.. వెల్కమ్ చెప్పిన రవితేజ..
Also Read: 'అన్ స్టాపబుల్' రివైండ్.. అల్లరి బాలయ్య..