'సుడిగాలి' సుధీర్, 'హైపర్' ఆది... ఇద్దరూ 'జబర్దస్త్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లే. సుధీర్‌ది ఓ స్టయిల్ అయితే... ఆదితో మరో స్టయిల్. ఒకరు 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' టీమ్ లీడర్ అయితే... మరొకరు 'జబర్దస్త్' టీమ్ లీడర్. ఇద్దరూ బుల్లితెర ఆడియన్స్‌ను తమదైన శైలిలో నవ్విస్తున్నారు. అటువంటి ఇద్దరూ ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ చేశారు.
'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' స్కిట్స్ కోసం టీమ్ లీడర్లకు దర్శకులు థీమ్ ఇస్తారు. ఈసారి సినిమా థీమ్ ఇచ్చారు. అనుకుని చేశారో... లేదంటే సేమ్ థాట్ వచ్చిందో... 'సుడిగాలి' సుధీర్, 'హైపర్' ఆది టీమ్స్ 'పుష్ప' సినిమా కాన్సెప్ట్ తీసుకుని స్కిట్స్ చేశాయి. సుధీర్, ఆది... ఇద్దరూ పుష్పరాజ్ క్యారెక్టర్స్ చేశారు. ప్రోమోలు చూస్తే... ఆది స్కిట్‌కు అనసూయ ప్లస్ అయ్యిందని చెప్పుకోవాలి. ఎందుకంటే... సుధీర్ స్కిట్‌లో రష్మిక పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్ కోసం ఓ అమ్మాయిని తీసుకున్నారు. ఆది హీరోయిన్ రోల్ కోసం ఎవరినీ తీసుకోలేదు. వెయ్యి రూపాయల పూజ ఎపిసోడ్‌ను అనసూయతో చేశాడు. అది పేలినట్టు ఉంది. స్కిట్స్ బయటకు వస్తే తప్ప ఎవరు ఎలా చేశారో తెలియదు.
'ఢీ' షోలో 'సుడిగాలి' సుధీర్, 'హైపర్' ఆది మధ్య పంచ్ డైలాగ్స్ బాగా పేలేవి. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో అప్పుడప్పుడూ ఆది కోసం అతడి స్కిట్స్‌లో సుధీర్ కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరూ సేమ్ క్యారెక్టర్ చేశారంతే! Jabardasth Latest Promo - 20th January 2022 - Anasuya,Hyper Aadi:
Also Read: కృతి శెట్టికి తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందో తెలుసా?Also Read: ఈ స్టార్ హీరోలు ఏం సాధించినా.. ఆ ఒక్క విషయంలో మాత్రం..Also Read: శాంతనుతో ఎప్పుడు ప్రేమలో పడిందీ, కలిసిందీ చెప్పిన శ్రుతీ హాసన్!Also Read: రజనీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లికి ధనుష్ చేసిన సాయం ఇదే!Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!Also Read: జనవరి 19 ఎపిసోడ్: సౌందర్య, ఆనంద రావు దగ్గరకు కార్తీక్... దీప ఏం చేయబోతోంది.. 'కార్తీక దీపం' బుధవారం ఎపిసోడ్Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి