దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మరోవైపు రోజువారి కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 2,82,970 కరోనా కేసులు నమోదుకాగా 441 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చెరింది. మంగళవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 18 శాతం పెరిగింది.
1,88,157 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 15.13గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.83గా ఉంది.
రాష్ట్రాలవారీగా..
మహారాష్ట్రలో కొత్తగా 39,207 కరోనా కేసులు నమోదయ్యాయి. 53 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
దిల్లీలో కొత్తగా 11,684 మందికి కరోనా సోకింది. 38 మంది మృతి చెందారు. దిల్లీ పాజిటివిటీ రేటు 22కు తగ్గింది.
గుజరాత్‌లో కొత్తగా 17,119 కరోనా కేసులు నమోదయ్యాయి.
జమ్ముకశ్మీర్‌లో కొత్తగా 4,651 మందికి కరోనా సోకింది ముగ్గురు మృతి చెందారు.
అసోంలో ఒక్కరోజులో 8,072 కేసులు నమోదయ్యాయి. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి అసోంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
వ్యాక్సినేషన్..
దేశంలో ఇప్పటివరకు 158 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.