హైదరాబాద్ శివారులోని షాద్‌ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న యువతి తికమక పడడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కదులుతున్న రైలు దిగుతుండగా పట్టుకోల్పోయి కింద పడడంతో చనిపోయింది. పూర్తి వివరాలివీ..


ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి (28) హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగా, జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా.. ఇటీవల సొంతూరుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రైల్వే కోడూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు ఆన్ లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసింది. రైలు షాద్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


Also Read: Case on PVP: నిర్మాత, వైసీపీ నేత పీవీపీపై కేసు.. ఫిర్యాదు చేసిన డీకే అరుణ కుమార్తె, అసలు గొడవ ఏంటంటే..


జ్యోతి రెడ్డి వెంకటాద్రి రైలు నుండి నిద్ర మత్తులో ప్లాట్ ఫామ్ పైకి దూకినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కడప నుండి హైదరాబాద్‌కు వస్తున్న జ్యోతి రెడ్డి కాచిగూడలో దిగాల్సి ఉండగా తెల్లవారుజామున నిద్ర మత్తులో షాద్ నగర్ స్టేషన్‌ను కాచిగూడ అనుకోని హడావిడిగా రైలు నుండి తన లగేజీతో ప్లాట్ ఫామ్ పైకి దూకింది. ఈ క్రమంలో జ్యోతి రెడ్డి రైలుకు ప్లాట్ ఫామ్‌కు మధ్యలో పడిపోయింది. కాళ్ళు నడుం భాగం తీవ్రంగా గాయపడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 


వెంటనే రైల్వే పోలీసులు జ్యోతిని గమనించి వైద్యం నిమిత్తం హైదరాబాద్‌కి తరలించారు. ఆమెను యశోద ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. జ్యోతి మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉదయం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. అందరూ చూస్తుండగానే జ్యోతి రైలు నుంచి కింద పడిపోయింది. జ్యోతి తలకు గాయం కావడమే మరణానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు.


Also Read: Telangana CEO శశాంక్ గోయల్ బదిలీ.. కేంద్ర సర్వీసుల్లోకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి


Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!


Also Read: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి