Shashank Goyal Into Central Services: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ కేంద్ర సర్వీసులకు వెళుతున్నారు. ఐఏఎస్ శశాంక్ గోయల్‌ను కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమించేందుకు నియామకాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


1990 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్ గోయల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. గత ఏడాది మే నెలలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. కేంద్ర కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగానూ శశాంక్ గోయల్ సేవలు అందించారు.


శశాంక్ గోయల్‌తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఎఫ్ఓ బీవీ ఉమాదేవి కేంద్ర హోంశాఖ మంత్రి అదనపు కార్యదర్శి (అటవీ మరియు వాతావరణ మార్పులు), ఐఏఎస్ శైలేష్ కుమార్ సింగ్‌ను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి, డెవలప్‌మెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. మనీష్ కుమార్ గుప్తా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కమిషనర్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అదనపు బాధ్యతలు.. చంచల్ కుమార్ ఐఏఎస్‌ను జాతీయ రహదారులు, మౌలిక వసతుల డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మనేజింగ్ డైరెక్టర్‌గా, ఆశిష్ శ్రీవాస్తవను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అదనపు కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. టెలీ కమ్యూనికేషన్స్ అడ్మినిస్ట్రేటర్, అదనపు కార్యదర్శిగా హరి రంజన్ రావు, రక్షణ శాక అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ కేబినెట్ సెక్రటరీగా పంకజ్ అగర్వాల్ నియమితులయ్యారు.


Also Read: Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ


Also Read: Horoscope Today 19th January 2022: ఈ రాశివారికి జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి..


Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?


Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. రూ.300 పెరిగిన వెండి, నేటి తాజా ధరలు ఇవీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి