ప్రపంచంలో ఒంటరిగా బతుకుతున్న మగవారి సంఖ్య తక్కువేమీకాదు. కొందరు వరుస లవ్ ఫెయిల్యూర్ల వల్ల విరక్తితో పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతుంటే, మరికొందరు వివాహమైనా భార్యతో పొత్తు కుదరక విడాకులు తీసుకుని సింగిల్ గా జీవిస్తున్నారు. మరికొందరు పెళ్లయ్యాక వచ్చే బాధ్యతలను భరించడం ఇష్టం లేక వివాహానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సింగిల్ పురుషులు, పెళ్ళయిన మగవాళ్లని చూసి ‘స్వేఛ్ఛ లేదని, పెళ్లానికి భయపడతాడని’... ఇలా చాలా జోకులు వేసుకుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే బరువులు బాధ్యతలు మోసే భర్తలకుంటే ఆరోగ్యం ఈ ఒంటరి మహానుభావులకు ఉండదు. వారు తమకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతురని చెబుతోంది కొత్త అధ్యయనం.
ఇదీ ఫలితం
డెన్మార్క్ లో యూనివర్సిటీ ఆప్ కోపెన్ హాగెన్లో ఒంటరి పురుషులపై పరిశోధనలు గత కొన్నేళ్లుగా సాగుతున్నాయి. ఆ అధ్యయనం ఫలితాలను ఇటీవల ప్రకటించారు. ఒంటరిగా జీవించడం, విడాకులు, లవ్ ఫెయిల్యూర్లు అధికంగా కావడం అనేది పురుషుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నట్టు గుర్తించారు. అలాంటి మగవారి శరీరంలో త్వరగా ఇన్ ఫ్లమ్మేషన్ మొదలవుతుందని చెప్పారు. అంటే శరీర అవయవాల్లో వాపు, మంటలు తరచూ కలుగుతుంటాయి. ఇందుకోసం పరిశోధకులు 48 నుంచి 62 వయసు మధ్య ఉన్న 4,835 మందిని పరిశీలించారు. 1986 నుంచి 2011 వరకు 26 ఏళ్ల పాటూ ఈ పరిశోధనలు సాగాయి. వారి ఆరోగ్య డేటాను పరిశీలించారు.
వారిలో ఒంటరిగా జీవిస్తున్న పురుషులతో పోలిస్తే ఒంటరిగా జీవించని, ఎలాంటి విడాకులు వ్యవహారాలు, ప్రేమ వైఫల్యాలు లేని పురుషులు ఆరోగ్యంగా ఉన్నట్టు తేల్చారు. వారిలో ఇన్ఫ్మ్మేషన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రేకప్ లు అనుభవించిన పురుషుల్లో ఇన్ఫ్లమ్మేషన్ స్థాయిలలో 17 శాతం పెరుగుదల కనిపించింది.
బ్రేకప్ బాధ వీరికే ఎక్కువ
పురుషుల్లో విడాకులు కావడం, సంబంధాలు విచ్చిన్నం కావడం అనేది వారి ఆరోగ్య క్షీణతకు దారితీస్తుందని, పెరిగిన మరణాల శాతంతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే మహిళల్లో మాత్రం ఇది చాలా తక్కువగా ఉంది. కాబట్టి పురుషులు తమ ఆరోగ్యం కోసమైనా ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టాలి.
Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...
Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి
Also read: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది
Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు