చీజ్ రుచే వేరు. దాన్ని చేరిస్తే పిజ్జా, బర్గర్, నగ్గెట్స్... వంటి వాటి రుచే మారపోతుంది. అన్ని దేశాల్లో చీజ్ లభిస్తుంది. ధర కూడా అన్ని వర్గాల వారికి అందుబాటులోనే ఉంటుంది. అందుకేనేమో వాడకం విపరీతంగా పెరిగింది. చీజ్ లో చాలా రకాలు ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. దీన్ని ఆవు లేదా గేదె పాలు, సోయా పాలతో తయారుచేస్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఉంది. దాన్ని గాడిద పాలతో చేస్తారు. కిలో చీజ్ కావాలంటే నలభై అయిదు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఈ చీజ్ ను కేవలం సెర్బియాలోని ఒక ప్రాంతంలో మాత్రమే తయారుచేస్తారు. ఈ చీజ్‌ను ‘పూల్’ అని పిలుస్తారు. ఒక కిలోగ్రామ్ చీజ్ తయారుచేయాలంటే ఆరున్నర గ్యాలన్ల గాడిద పాలు అవసరం. సెర్బియా నుంచే గత 24 ఏళ్లుగా చీజ్ ఎగుమతి అవుతోంది.
పూల్ చీజ్ తయారీలో 60 శాతం గాడిదపాలను వాడితే, 40 శాతం గొర్రె పాలను వాడతారు. సెర్బియాలోకే గాడిదలు 1000 కన్నా తక్కువ ఉన్నాయి. వాటి పాలను సేకరించి నిల్వచేసి అవి గ్యాలన్ల కొద్దీ అయ్యాక చీజ్ తయారీకి వాడతారు. గాడిద పాలు భారీగా సేకరించాలే చాలా సమయం పడుతుంది... అందుకే ఈ చీజ్ అంత ధర పలుకుతోంది. దీని రుచి కూడా బాగుండడంతో అమ్మకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ చీజ్ కోసం ముందుగానే ఆర్డర్లు అందుకుంటారు తయారీ దారులు.
లీటర్ రూ.పదివేలు
మనదేశంలో కూడా మహారాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. అక్కడ లీటరు పాలు అయిదువలే రూపాయల నుంచి పదివేల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ పాలలోని బ్యాక్టిరియాలో దాదాపు 80శాతం లాక్టిక్ యాసిడ్ బాక్టరియా ఉంటుంది. ఇది పొట్టలో వచ్చే రుగ్మతలను నివారిస్తుంది. గుండెజబ్బులు, అంటు వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జ్వరం, ఉబ్బసం వంటి రోగాల చికిత్సకు గాడిద పాలను ఉపయోగిస్తారు. అందుకే వాటి ధర అంతగా పెరిగిపోయింది.
Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు
Also read: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...
Also read: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?
Also read: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు
Also read: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?