వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఘాటుగా ఏదైనా తినాలనిపించడం సాధారణం. అలాంటప్పుడు ఈ మసాలారైస్ చేసుకుని తింటే అదిరిపోతుంది. చేయడం కూడా చాలా సులువే. అన్నట్టు ఇందులో కొన్ని కూరగాయ ముక్కలు, మసాలా దినుసుులు కూడా వేస్తాం కాబట్టి పోషకాహారంగా కూడా చెప్పుకోవచ్చు. 


కావాల్సిన పదార్థాలు
వండిన అన్నం - ఒక కప్పు
టమోటో - ఒకటి 
కాప్సికం - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
క్యారెట్ - ఒకటి 
గ్రీన్ బీన్స్ ముక్కలు - గుప్పెడు
పచ్చి  బఠాణీలు - గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూనులు
ఆయిల్ - రెండు టీ స్పూనులు
ఆవాలు - అరటీస్పూను
పసుపు - పావు టీస్పూను
ధనియాల పొడి - అర టీస్పూను
జీలకర్ర - పావు టీస్పూను
కారం - ఒక టీస్పూను
గరం మసాలా పొడి - పావు టీస్పూను
వేయించిన జీడి పప్పులు - గుప్పెడు
ఉప్పు - తగినంత


తయారు చేసే విధానం
1. ఉల్లిపాయలు, టమోటో, కాప్సికం, క్యారెట్ ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. తరువాత టమోటా వేసి ఉప్పు వేసి కలపాలి. టమోటాలు మెత్తగా నలిగే వరకు వేయించాలి. 
3. క్యారెట్, కాప్సికం, గ్రీన్ బీన్స్, పచ్చి బఠాణీలు వేయాలి. పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. పైన మూత పెట్టి అయిదు నిమిషాల పాటూ ఉంచాలి. 
4. అవి బాగా ఉడికాక వండిన అన్నాన్ని వేసి పులిహోర కలిపినట్టు కలుపుకోవాలి. పైన కాస్త గరం మసాలా పొడి చల్లి మళ్లీ కలపాలి. ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచాలి. తరువాత కట్టేయచ్చు. 
5. జీడి పప్పులు పైన చల్లుకుని... వేడిగా వేడిగా తింటుంటే ఆ మజాయే వేరు.  


Also read: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?


Also read: ఈ మూడు పానీయాలు త్వరగా బరువు తగ్గేలా చేస్తాయి


Also read: ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తింటే కళ్లద్దాల అవసరం రాదట... కంటిచూపును కాపాడే దివ్యౌషధాలు


Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...


Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు





 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.