భోజనం చేశాక పండు తినడం మంచి అలవాటే, కానీ పండు తిన్నాక నీళ్లు తాగడం మాత్రం కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో, ఏ సమస్యలు కలుగుతాయో తెలుసుకోండి. 


అజీర్తి
పండ్లు తిన్నాక నీరు తాగితే ఆమ్లత్వానికి కారణమవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది పండ్లలోని పోషకాలను శరీరం గ్రహించడాన్ని కూడా నిరోధిస్తుంది. ఇది పొట్టలో అసౌక్యంగా అనిపిస్తుంది. కాబట్టి పండ్లు తిన్నాక ఒక గంట వరకు నీళ్లు తాగకూడదు. 


అసిడిటీ
ఏ పండ్లను తీసుకున్నా వెంటనే నీళ్లు తాగితే జీర్ణ రసాలు పలచగా మారుతాయి. ఎంజైమ్ లు కూడా సరిగా పనిచేయలేవు. దీనివల్ల సరిగా జీర్ణంకాక ఎసిడిటీ మొదలవుతుంది. 


గ్యాస్ సమస్య
పండ్లలో అధికంగా ఫ్రక్టోజ్, ఈస్ట్ ఉంటాయి. పండ్లు తిన్నాక నీళ్లు తాగడం వల్ల పొట్టలోని ఆమ్లాలు నీటితో కలిసి పలుచగా మారిపోతాయి. దీని వల్ల గ్యాస్ అధికంగా ఏర్పుడుతుంది. దీనివల్ల కడుపు నొప్పిగా అనిపించి, విపరీతంగా అపానవాయువు విడుదలవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యగా మారే అవకాశం ఉంది.


మధుమేహం పెరుగుతుంది
డయాబెటిక్ రోగులు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.  జీర్ణ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. జీర్ణం కాని ఆహారం కొవ్వుగా మారిపోతుంది. తద్వారా ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి డయాబెటిస్, ఊబకాయం సమస్యలు పెరిగే అవకాశం ఉంది. 


గుండెల్లో మంట
జీర్ణ ఆమ్లాలను నీళ్లు పలుచన చేస్తాయని ముందే చెప్పాం. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడి, గుండెల్లో మంట వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అందుకే పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే అసౌకర్యంగా అనిపిస్తుంది. 


ph స్థాయికి ఆటంకం
పుచ్చకాయ, సీతాఫలం, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి అధిక నీటి శాతం ఉన్న పండ్లు తిన్నాక నీళ్లు తాగితే అవి జీర్ణ వ్యవస్థలోని Ph స్థాయిని మారుస్తాయి. దాని వల్ల కూడా పొట్టలో ఆమ్లాలు అధికంగా విడుదల కావచ్చు. కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం మానుకోండి. 


Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు


Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు


Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే


Also read: పాలకూర పులావ్... పోషకాలు పుష్కలం, ఎలా చేయాలంటే...


Also read: అప్పుడప్పుడు వచ్చి పోయే ఈ లక్షణాలు చాలా ప్రమాదకరం, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు


Also read: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?



 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.