వెల్లుల్లికి తెలుగు వంటల్లో ఉన్న ప్రాధాన్యం చాలా ఎక్కువ. బిర్యానీ దగ్గర నుంచి కూరల వరకు కచ్చితంగా దీన్ని వేయడం అలవాటుగా మార్చుకున్నారు ప్రజలు. అలా కాకుండా వెల్లుల్లి నీళ్లను తయారుచేసుకుని తాగితే మరింత ప్రభావవంతంగా ఫలితాలు కలుగుతాయి.  ముఖ్యంగా చలికాలంలోనే ఈ వెల్లుల్లి నీళ్లను తాగాలి. వాతావరణం చల్లబడడం వల్ల కలిగే అనారోగ్యాలేవీ మీ దరిచేరవు. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు సైతం కలుగుతాయి. 


ఎలా చేయాలి?
వెల్లుల్లి నీళ్లను చేయడం చాలా సులువు. మూడు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చితక్కొట్టాలి. ఒక గ్లాసుడు నీళ్లను గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలను వేడి మరిగించాలి. ఓ అయిదు నిమిషాల పాటూ మరిగాక వడకట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం పూట టీకి బదులు తాగాలి.  టిఫిన్ అనంతరం తాగినా, ముందు తాగినా మంచిదే.


ఎన్ని లాభాలో...
1. చలికాలంలో సాధారణంగా మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, చురుగ్గా ఉండదు. వెల్లుల్లిలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి కనుక ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ కాలంలో తరచూ వచ్చే దగ్గు, జలుబు రాకుండా జాగ్రత్తపడచ్చు. 
2. బరువు తగ్గాలనుకునే వారికి కూడా వెల్లుల్లి నీరు మేలు చేస్తుంది.  దీన్ని రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడం ఖాయం. 
3. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ నీళ్లను తాగవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. 
4. వెల్లుల్లిలోని గుణాలు శరీరంలో రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చూస్తుంది. దీనివల్ల హైబీపీ కలగకుండా జాగ్రతవహించవచ్చు. 
5. చలికాలంలో గుండె సమస్యలు అధికంగా వస్తుంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం గుండె పోటు కూడా చల్లని వాతావరణంలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెల్లుల్లి నీళ్లను రోజూ తీసుకోవాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6. వెల్లుల్లి నీరు కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. రోజూ తాగడం వల్ల ఆ నొప్పులు అదుపులో ఉంటాయి.
7. రక్తాన్ని శుధ్ది చేయడంలో కూడా వెల్లుల్లి నీరు సహకరిస్తుంది. 
8. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ఈ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. సహజపద్దతిలో ఆ సమస్య తగ్గుతుంది. 


Also read: చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే బీట్‌రూట్ కొబ్బరి పాల సూప్... తాగితే రక్తహీనత దరిచేరదు


Also read: జీవితంలో కిక్కు మిస్సయిందా? అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయండి


Also read: విడాకులకు దారితీసే ప్రధాన కారణాలు ఇవే... ఈ విషయాల్లో సర్దుకుపోవాల్సిందే


Also read: ఇరవై ఎనిమిది వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఒప్పుకున్న కోర్టు... ఆరోగ్యపరంగా రిస్క్ ఉండదా?


Also read: పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్స్


Also read: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఇవి తింటే.. మీ కోరిక నెరవేరుతుంది.. హార్వర్డ్ స్డడీ














ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.