కరోనా మూలంగా రెండేళ్లుగా జీవితం నిస్సారంగా అనిపిస్తోంది చాలా మందిలో. ఉద్యోగ జీవితం ఇంటికే పరిమితం అయింది. సహోద్యోగులతో చిల్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. పార్టీలు, వేడుకలు కూడా తగ్గాయి. కొత్త వేరియంట్లు వస్తున్న కొద్దీ మరింతగా నిరాశ కమ్మేస్తోంది. జీవితంలో కిక్కు మిస్సయిందంటూ అనేక మంది ఫీలవుతున్నారు. మళ్లీ జీవితం ఆసక్తిగా, ఆనందదాయకంగా మారాలంటే కొన్ని పనులు చేయాల్సిందే. అవన్నీ మీ జీవితాన్ని మరింత ఆసక్తిగా మారుస్తాయి. 


1. పర్వతారోహణ
మీకు దగ్గర్లో పర్వతాలు లేకుంటే కొండల మీదకైనా స్నేహితులతో కలిసి కాలినడకన ఎక్కండి. లేదంటే పక్కరాష్ట్రాల్లో ఉండే ప్రసిద్ధ పర్వతాలను చేరుకుని ట్రెక్కింగ్ చేయండి. ప్రకృతి చేసే మాయే వేరు. ట్రెక్కింగ్ మీలోని పట్టుదలను పెంచుతుంది. నిరాశను తరుముతుంది. 


2. సోలో ట్రిప్
ఎప్పుడూ గుంపులుగానే వెళ్లద్దు. మీ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఒంటరిగానే ట్రిప్‌కి వెళ్లండి. సోలో ట్రిప్ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీలోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ తెలిసేలా చేస్తుంది. సోలో ట్రిప్‌లో కిక్కు దొరకడం కచ్చితం. నా అన్నవారు చుట్టూ లేకపోతే మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసేది ఇలాంటి పర్యటనల్లోనే. 


3. పెట్టుబడులు పెట్టండి
చిన్న వయసులోనే మీ సంపాదనతోనే విలువైన వస్తువులు కొంటే ఇచ్చే ఆనందమే వేరు. ఇల్లు, స్థలం మీద పెట్టుబడి పెట్టి చూడండి. లోన్లు కోసం తిరిగితే తెలుస్తుంది ఏదైనా ఆస్తి కొనడంలోని కష్టం. ఈ ప్రాసెస్ అంతా మీకు కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుంది. 


4. సంగీత వాయిద్యం
ఆఫీసు, ఇంటి పని పూర్తయ్యాక కాస్త సమయం మీకోసం మిగిలేలా చూసుకోవాలి. ఆ సమయంలో ఏదో ఒక సంగీతం వాయిద్యం నేర్చుకోవాలి. నేర్చుకోవడం కష్టంగా అనిపించినా , జీవితంలో కొత్తదనం చేరినట్టు అనిపిస్తుంది. 


5. మీకోసం ఓ బహుమతి
బహుమతి ఎప్పుడు ఎదుటివారికి ఇచ్చేదే అనుకుంటాం. అందుకే మనకి మనం కొనుక్కోం. మంచి ఖరీదైన వస్తువును మీకోసం మీరే గిఫ్టుగా కొనుక్కొని ఇచ్చుకోండి. 


6. ఆహారం
నిత్యం ఒకేలాంటి ఆహారం తినడం వల్ల జీవితం కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త రుచులు తినాల్సిన అవసరం ఉంది. ప్రతి వారం ఏదో ఒక కొత్తరుచి చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. కాంటినెంటల్, మెడిటేరియన్, యూరోపియన్ ఇలా రకరకాల ఆహార పదార్థాలను రుచి చూస్తూ ఉండండి. 


7. ప్రతి ఏడాది...
ప్రతి ఏడాది లేదా ఆరు నెలలకోసారి మీకు తెలియని, కనీసం భాష కూడా రాని ప్రాంతాలకు పర్యటనకు వెళ్లండి. ఆ ట్రిప్ చాలా ఎంజాయింగ్‌గానే కాదు,  సవాళ్లతో కూడుకుని ఉంటుంది. సోలోగా లేదా స్నేహితులతో మాత్రమే ఇలాంటి పర్యటనలకు వెళ్లాలి. అప్పుడే అదిరిపోతుంది. జీవితంలో కిక్ మామూలుగా ఉండదు.  


Also read: చలికాలంలో రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


Also read: విడాకులకు దారితీసే ప్రధాన కారణాలు ఇవే... ఈ విషయాల్లో సర్దుకుపోవాల్సిందే


Also read: ఇరవై ఎనిమిది వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఒప్పుకున్న కోర్టు... ఆరోగ్యపరంగా రిస్క్ ఉండదా?


Also read: పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్స్


Also read: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఇవి తింటే.. మీ కోరిక నెరవేరుతుంది.. హార్వర్డ్ స్డడీ


Also read: వార్నీ... ఈ యూనివర్సిటీలో తినడం, తాగడం నేర్పిస్తారట, చివరికి అది కూడా...


Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా














ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.