పెళ్లి అనేది ఓ అందమైన అనుభూతి. జీవితాన్ని అల్లుకునే బంధం. ఆ బంధానికి బీటలు వారుతున్నాయి. ఎంతో మంది భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఇమడలేక విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవలి కాలంలో విడాకుల తీసుకునే రేటు చాలా పెరిగింది. విడాకులకు దారి తీస్తున్న సాధారణ కారణాలను ఓ సర్వే ద్వారా తెలుసుకున్నారు. 


మిస్‌కమ్యూనికేషన్ 
భార్యాభర్తల మధ్య జరిగే చాలా తగాదాలకు, వాదనలకు మూల కారణం మిస్‌కమ్యూనికేషన్. కుటుంబ సమస్యలు, ఆర్ధిక భారాలు ఇద్దరూ కూర్చుని చర్చించుకుంటూ ఉండాలి. భార్యభర్తల మధ్య దూరం పెంచేవి ముఖ్యంగా ఈ రెండే. 


నమ్మకం లేకపోవడం
జీవితంలో ఏ బంధం నిలబడాలన్న నమ్మకం చాలా ముఖ్యం. కేవలం భార్యాభర్తల బంధమేకాదు, స్నేహానికి కూడా మూల స్తంభం నమ్మకమే. కానీ ఆ నమ్మకమే లేకపోతే ప్రతిది అనుమానాస్పదంగానే ఉంటుంది. కాబట్టి భార్యభర్తలిద్దరూ ఒకరిని ఒకరు సంపూర్ణంగా నమ్మాలి. ఒక్కసారి నమ్మకద్రోహం జరిగినా వివాహబంధం నిలబడడం కష్టమే అవుతుంది. అందుకే ఏ విషయాన్నైనా జీవితభాగస్వామితో పంచుకోండి. విషయాలను దాయాలని ప్రయత్నించొద్దు.


చెడు వ్యసనాలు 
వ్యసనాలు కలిగిన వ్యక్తిని ఏ జీవిత భాగస్వామి అంగీకరించలేదు. అతనితో ఎక్కువ రోజులు ప్రయాణం సాగించలేదు. ఆల్కహాల్, డ్రగ్స్ వినియోగం ఉన్న వారిని వదిలేసేందుకు ఎక్కువ మంది భార్యలు, లేదా భర్తలు మొగ్గు చూపుతున్నారు. వీటి వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా మొదలవుతాయి. 


గృహహింస
విడాకులకు ప్రధానమైన కారణం ఇదే. మహిళలు గృహహింస కారణంగానే ప్రధానంగా విడాకులు కోరుకుంటున్నారు. మానసికంగా, శారీరకంగా పెట్టే హింస భర్తపై విరక్తిని పెంచుతుంది. అతనితో బంధాన్ని తెంపుకునే నిర్ణయానికి వచ్చేలా చేస్తుంది. గృహహింస ఉన్న ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. 


కుటుంబ సమస్యలు
కేవలం భార్యభర్తలు ఇద్దరే కాదు, వారి కుటుంబ సభ్యుల ప్రవర్తన, వారి వల్ల వచ్చే సమస్యలు కూడా జంటలు విడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. జంటల జీవితాల్లోకి వారి కుటుంబ సభ్యులు తొంగి చూడడం, ప్రతి దానికి కల్పించుకోవడం ఎక్కువవుతున్న కొద్దీ భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ముందు మీరు, మీ జీవితభాగస్వామి, మీ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మిగతా వాళ్ల మాటలకు మీరు లొంగడం మొదలుపెడితే మీ చిన్నకుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఇబ్బంది పడేది మీ పిల్లలే.  వారు చేయని తప్పుడు శిక్ష వేయడం సమంజసమా. మీ పిల్లల కోసమైనా సర్దుకుపోకతప్పదు. 


Also read: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఇవి తింటే.. మీ కోరిక నెరవేరుతుంది.. హార్వర్డ్ స్డడీ


Also read: వార్నీ... ఈ యూనివర్సిటీలో తినడం, తాగడం నేర్పిస్తారట, చివరికి అది కూడా...


Also read: అంధుల పాలిట వరం బ్రెయిలీ లిపి... అసలు ఎవరీ బ్రెయిలీ? అతనెందుకు ఈ లిపిని కనిపెట్టారు?


Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా


Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు














ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.