తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు మరింతగా తగ్గింది. గ్రాముకు రూ.35 మేర తగ్గింది. వెండి ధర నేడు గ్రాముకు రూ.0.50 పైసలు తగ్గి కిలోకు రూ.500 దిగజారింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,990 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.65,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,700గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరలో అతి స్వల్ప తగ్గుదల మాత్రమే కనిపించింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,170గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,230గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.5 తగ్గి.. రూ.23,020 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Budget 2022: ప్రభుత్వ బడ్జెట్ ఇన్ని రకాలా? ఇండియాలో ఏది అమలు చేస్తారో తెలుసా?
Also Read: Budget 2022: రైతన్నకు శుభవార్త! 4% వడ్డీకి రూ.18 లక్షల కోట్లు పంట రుణాలు ఇవ్వనున్న కేంద్రం!