Budget 2022 Telugu: అన్నదాతకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2022-23 బడ్జెట్‌లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.18 లక్షల కోట్లకు పెంచనుందని తెలిసింది. ఫిభ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సంబంధిత కేటాయింపులు పెంచనుంది.
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వం రుణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లుగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏటా ప్రభుత్వం క్రెడిట్ టార్గెట్‌ను పెంచుతోంది. ఈ సారీ అలాగే చేయనుంది. 2022-23 కోసం లక్ష్యాన్ని రూ.18-18.5 లక్షల కోట్లకు పెంచనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి చివర్లో ఎంత పెంచుతున్నారన్న అంశంపై స్పష్టత రానుంది.
బ్యాంకులకు పంట రుణాల లక్ష్యాలనూ ప్రభుత్వం ఇదే సమయంలో నిర్దేశిస్తుంది. కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో నగదు రుణ లభ్యత పెరుగుతోంది. ప్రతి ఆర్థిక ఏడాదిలో నిర్దేశించుకున్న సంఖ్యకు మించే పెంచుతోంది. ఉదాహరణకు 2017-18లో రూ.10 లక్షల కోట్లను నిర్ణయించుకోగా రైతులకు రూ.11.68 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడం గమనార్హం. 2016-17లో రూ.9 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకొని రూ.10.66 లక్షల కోట్ల మేరకు పంట రుణాలు ఇచ్చింది.
వ్యవసాయ ఉత్పత్తి పెరగాలంటే పంట రుణాలు ఇవ్వడం అత్యంత కీలకం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడం వల్ల రైతులు ఇతరుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం తగ్గుతుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. సాధారణంగా పంట రుణాలకు తొమ్మిది శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఉత్పత్తి పెంచేందుకు, వడ్డీ భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వడ్డీలో కొంత మాఫీ చేస్తోంది.
రూ.3లక్షల లోపు స్వల్పకాల రుణాలు తీసుకొనే రైతులకు వడ్డీలో రెండు శాతం సబ్సిడీ ఇస్తోంది. గడువులోగా రుణాలు తీరిస్తే మరో మూడు శాతం ఇన్‌సెంటివ్ అందిస్తోంది. ఫలితంగా నాలుగు శాతం వడ్డీకే రుణాలు దొరుకుతున్నాయి. ఇక తనఖా లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.లక్ష నుంచి ఆర్‌బీఐ రూ.1.6 లక్షలకు పెంచింది.
Also Read: Car Sales Dec 2021: హ్యూందాయ్‌కు 'టాటా' మోటార్స్ సెగ.. డిసెంబర్లో కార్లను మామూలుగా అమ్మలేదు మరి!
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
Also Read: IPO craze: 23 కంపెనీలు.. రూ.44000 కోట్లు! 2022లోనూ ఐపీవో క్రేజ్
Also Read: Tesla: మళ్లీ సర్‌ప్రైజ్ చేసిన మస్క్! ఆటోపైలట్ హెడ్‌గా చెన్నై వ్యక్తి ఎంపిక