టాటా మోటార్స్‌ అదరగొట్టింది! దశాబ్దంలో తొలిసారి దేశవాళీ మార్కెట్లో అత్యధికంగా ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించిన రెండో సంస్థగా నిలిచింది. 2021, డిసెంబర్లో హ్యూందాయ్‌ మోటార్స్‌ ఇండియాను వెనక్కినెట్టింది. అంతేకాకుండా నెలవారీ, వార్షిక విక్రయాల్లో డిసెంబర్లో దుమ్మురేపింది.


2021, డిసెంబర్లో టాటా మోటార్స్‌ 35,300 యూనిట్లను విక్రయించగా హ్యూందాయ్‌ 32,312కు పరిమితం అయింది. ఇక అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో టాటా మోటార్స్ 99,000 వాహనాలను విక్రయించింది. 2021ని 3.31 లక్షల యూనిట్లతో ముగించింది. సెమీ కండక్టర్ల కొరత వేధించినా, ఉత్పత్తి తగ్గినా ఈ త్రైమాసికంలో టాటా మోటార్స్‌ సరికొత్త రికార్డులు నెలకొల్పిందని సంస్థ ప్యాసింజర్‌ వెహికల్‌ బిజినెస్‌ యూనిట్‌ అధ్యక్షుడు శైలేశ్‌ చంద్ర అన్నారు.


'దశాబ్ద కాలంలోనే 2021, డిసెంబర్లో అత్యధిక యూనిట్లను విక్రయించాం. 35,299 యూనిట్లు అమ్మాం. 2022 ఆర్థిక ఏడాది మూడో క్వార్టర్లో 99,002 యూనిట్లు, మొత్తంగా గత క్యాలెండర్‌ ఇయర్‌లో 3,31,178 వాహనాలు విక్రయించాం. వ్యాపారం స్థాపించినప్పటి నుంచి ఇవే రికార్డు అమ్మకాలు. 2021, అక్టోబర్లో టాటా పంచ్‌ ఆవిష్కరించినప్పటి నుంచి మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది' అని శైలేశ్‌ తెలిపారు.


ఇక 2021లో హ్యూందాయ్‌ మోటార్స్‌ను సెమీ కండక్టర్ల కొరత వేధించింది. ఫలితంగా కంపెనీ తన ఉత్పత్తిని దిద్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. విడి పరికరాలు లభ్యం కాకపోవడంతో కొన్నిసార్లు ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చింది. విడి పరికరాలు అందుబాటులో లేకపోయినా హ్యూందాయ్‌ మెరుగ్గానే విక్రయాలు చేపట్టిందని సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ గార్గ్‌ అన్నారు. మరోవైపు టాటా మోటార్స్‌ ఎలక్ట్రానిక్‌ వాహన విక్రయాలూ ఊపందుకున్నాయి. డిసెంబర్లో 2255 యూనిట్లు అమ్మడంతో ఈ క్వార్టర్లో మొత్తం విక్రయాలు 6,592కు చేరుకున్నాయి.


Also Read: New Year New GST: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !


Also Read: Commercial LPG Price : పెంచుతూ పోయి... చివరికి కాస్త తగ్గించారు !వాణిజ్య సిలిండర్ ధరను రూ. వంద తగ్గించిన కంపెనీలు !


Also Read: Liquor Sales: తెలంగాణలో కిక్ ఎక్కించిన మద్యం అమ్మకాలు.. ఈ 5 రోజుల్లో మందుబాబులు అన్ని కోట్లు తాగేశారా..!


Also Read: Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..


Also Read: Dual Mode Vehicle: ఇది బస్సే కాదు రైలు కూడా.. ఐడియా సూపర్ ఉంది కదా!


Also Read: Alto 2022: త్వరలో ఆల్టో కొత్త మోడల్ కూడా... బడ్జెట్‌లో సూపర్ కారు!