మనం ఇప్పటివరకు బస్సులను చూశాం.. రైళ్లను కూడా చూశాం.. ఇప్పుడు ఈ రెండిటి కాంబినేషన్ కూడా వచ్చేసింది. అదే డీఎంవీ! డీఎంవీ అంటే డ్యూయల్ మోడ్ వెహికిల్. అంటే ఇది రోడ్ల మీదనే కాదు.. రైలు పట్టాలపై కూడా పరిగెడుతుందన్న మాట. ప్రపంచంలో ఇటువంటి మొదటి వాహనం ఇదే. దీనికి సంబంధించిన సేవలు జపాన్‌లో ప్రారంభం అయ్యాయి.
ఆసా కోస్ట్ రైల్వే సంస్థ ప్రారంభించిన ఈ కొత్త సేవల ద్వారా టూరిస్టు ప్రదేశాలకు వెళ్లడం మరింత తేలిక కానుందని స్థానికులు అంటున్నారు. పర్యాటకులను ఈ సేవలు ఆకట్టుకోనున్నాయని వారు తెలిపారు. దీనికి సంబంధించిన మొదటి బ్యాచ్ బస్సులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. జపాన్‌లోని టొకుషియా, కొచిల నడుమ తక్కువ ధరకే ఈ డీఎంవీ సేవలను అందిస్తుంది.
డీఎంవీల ద్వారా చిన్న టౌన్ల మధ్య రవాణాపై దృష్టి పెట్టారు. స్థానిక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు లాభాలను కళ్లజూడటానికి కష్టపడుతున్న చోట ఈ వాహనాలు సాయంగా నిలవగలవని ఆసా కోస్ట్ రైల్వే సీఈవో షిగెకి మియురా తెలిపారు. ఈ సేవల లాంచ్ సమయంలో టొకుషిమా గవర్నర్ కమోన్ ఐజుమి కూడా పాల్గొన్నారు.
ఈ డీఎంవీలను లాంచ్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టిందని కైయో మేయర్ షిగెకి మియురా తెలిపారు. ఈయే ఆసా కోస్ట్ రైల్వేకి ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ డీఎంవీ చూడటానికి మినీ బస్ తరహాలో ఉంటుంది. దీనికి సాధారణ రబ్బర్ టైర్లు ఉంటాయి. అయితే రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు ఈ వాహనం ట్రెయిన్ క్యారేజ్‌గా మారిపోతుంది.
ఇందులో 21 మంది ప్రయాణం చేయవచ్చు. రైల్వే ట్రాక్‌లపై గంటకు 60 కిలోమీటర్లు, పబ్లిక్ రోడ్లపై 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని ఇది అందుకోగలదు. దీని ధర 1.2 మిలియన్ డాలర్ల వరకు ఉండనుంది. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.9 కోట్ల వరకు ఉండవచ్చన్న మాట.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?