కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనే మందుబాబులకు ఓ గుడ్ న్యూస్ లాంటిదే ఇది. హాయిగా ఇంటికి వెళ్లొచ్చన్నమాట. అందుకోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అయితే సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్ సర్వీసులు ఉంటాయి. ఈ ఈవెంట్లకు వెళ్లేవారి కోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు బస్సులు ఉంటాయి. మళ్లీ.. తిరుగు ప్రయాణం


అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు టీఎస్ ఆర్టీసీ సేవలు అందించనుంది. 18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసి సూచించిన 15 ప్రాంతాల్లో మాత్రమే బస్సులు అందుబాటులో ఉంటాయి. మరోవైపు కొత్త సంవత్సరం కానుకగా జనవరి1వ తేదీన తల్లిదండ్రులతో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.






టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించే దిశగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ ప్రతిష్ఠను పెంచేందుకు ఆయన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అదే సమయంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే ప్రతి గురువారం ‘బస్ డే’ నిర్వహించాలని ఇటీవలే.. సజ్జనార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను అకట్టుకునేందుకు టీఎస్‌ ఆర్టీసీ ప్రతి గురువారం ‘బస్‌ డే’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, అడ్మినిస్టేట్‌ ఆఫీసర్లు అందరూ విధిగా ప్రతి గురువారం బస్సులో కార్యాలయాలకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అదేశించారు. ఇందులో భాగంగా ప్రతీ గురువారం ‘బస్‌ డే’ కార్యక్రమం మొదలు పెట్టారు.


Also Read: Minister KTR: టెక్స్‌టైల్‌పై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలి.. నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ 


Also Read: Hyderabad Traffic: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఫ్లైఓవర్లు మూసివేత, ఓఆర్ఆర్ పై కార్లకు నో ఎంట్రీ... ఆంక్షలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు


Also Read: Omicron in Telangana: కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్