ప్రేమకు కులం లేదు, మతం లేదంటారు. ప్రేమకు సరిహద్దులు కూడా లేవని మరోసారి రుజువైంది. ఆంధ్ర అబ్బాయి, టర్కీ అమ్మాయి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. గుంటూరుకు చెందిన మధు సంకీర్త్, టర్కీ అమ్మాయి గిజెమ్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గిజెమ్ 2016లో ఓ ప్రాజెక్టు విషయమై భారత్ వచ్చింది. ఆ సమయంలో గిజెమ్ కు మధుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఉద్యోగ రీత్యా మధు కూడా టర్కీ వెళ్లాడు. దీంతో వీరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఈ అనుబంధం ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో ఇటీవలే సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. 


Also Read: అశోక్‌గజపతిరాజుపై ఉన్న కేసుల్లో తదుపరి చర్యలొద్దు.. పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం !


2019లోనే నిశ్చితార్థం


ఇంట్లో పెద్దల అంగీకారంతో ఈ జంట 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2020లో వివాహం చేసుకోవాలని భావించారు. అయితే కోవిడ్ కారణంగా వారి వివాహం ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇటీవలే ఈ జంట హిందూ ఆచారాలతో వివాహం చేసుకున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన మధు సంకీర్త్ తల్లిదండ్రులు దమ్మాటి వెంకటేశ్వర్లు, గౌరీశంకరి. ఈ వివాహంపై మొదట్లో ఇరు కుటుంబాలు కొంచెం సంశయించాయి. కానీ తర్వాత మనసు మార్చుకుని పెళ్లికి అంగీకరించారు. వాస్తవానికి మధు, గిజెమ్ ల నిశ్చితార్థం 2019 జరిగింది. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఈ ఏడాది జులైలో టర్కీలో అమ్మాయి తరఫున సంప్రదాయబద్దంగా పెళ్లి జరిగింది. ఇప్పుడు భారత్ లో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చెసుకున్నారు. మధు, గిజెమ్ ప్రస్తుతం ఆస్ట్రియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. 


Also Read:  రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్..


ఫ్రెంచ్ అమ్మాయి బిహార్ అబ్బాయి


దేశాంతర వివాహాలతో ఇదే మొదటికాదు. ఇటీవల పారిస్‌లో వ్యాపారవేత్త అయిన మేరీ లోరీ హెరాల్ అనే ఫ్రెంచ్ మహిళ తన టూర్ గైడ్, బిహార్ బెగుసరాయ్‌లోని కఠారియా గ్రామంలో నివసించే రాకేష్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరూ ఆరు సంవత్సరాల క్రితం బిహార్ లో కలుసుకున్నారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ఇటీవలె వీరు వివాహం చేసుకున్నారు. మేరీకి భారతీయ సంస్కృతిపై ఆసక్తితో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 


Also Read: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి