Ashok Gajapati Raju : అశోక్‌గజపతిరాజుపై ఉన్న కేసుల్లో తదుపరి చర్యలొద్దు.. పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం !

అశోక్ గజపతిరాజుపై నమోదైన కేసుల్లో తదుపరి చర్యలు వద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రామతీర్థం ఆలయం శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన ఘటనలపై ఆయనపై కేసులు నమోదు చేశారు.

Continues below advertisement


తెలుగుదేశం పార్టీ నేత, రామతీర్థం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించించింది. ఆయనపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో తదుపరి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. రామతీర్థం ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గందరగోళం సృష్టించారని ఈవో పోలీసులకు ఫిర్యాదు  చేయడంతో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ఆస్తులను ధ్వంసం చేశారని  ఆయనపై కేసు నమోదు చేశారు  . దీన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు అశోక్‌ గజపతిరాజు. 

Continues below advertisement

Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !

తనకు  353 యాక్ట్‌ వర్తించదని.. పైగా ఫిర్యాదుదారుడు 353 యాక్ట్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అందించలేదని హైకోర్టులో వాదించారు.  ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని స్టే ఇచ్చింది. పోలీసులను నివేదిక అందించాలని ఆదేశించింది. నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు ఈ కేసులో పోలీసులు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఏడాది కిందట విజయనగరం జిల్లాలో బొడికొండపై ఉన్న రామతీర్థం ఆలయంలోని శ్రీరాముల వారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు . 

Also Read: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

ఈ ఘటన దుమారం రేపింది. నిందితుల్ని పట్టుకోలేకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన పూర్వీకులు ఆ ఆలయాన్ని కట్టించారని ప్రభుత్వం ధర్మకర్తగా ఆయనను పదవి నుంచి తొలగించలేదని తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. అలాగే మాన్సాస్ ట్రస్ట్ విషయంలోనూ అంతే జరిగింది. న్యాయపోరాటం ద్వారా అశోక్ గజపతిరాజు ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల నుంచి అనుకూల ఫలితాలు పొందారు. 

Also Read: పవన్‌ను పదే పదే టార్గె‌ట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?

ఇప్పుడు కేసులు కూడా తనపై కక్ష సాధింపు కోసమే చేస్తున్నారని.. ఏదో విధంగా అరెస్ట్ చేయాలనుకుంటున్నారని అశోక్ గజపతిరాజు వాదిస్తున్నారు. రామతీర్థంలో శంకుస్థాపన జరిగిన రోజున తనను అవమానించారని అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. అయితే అశోక్ అనుచితంగా ప్రవర్తించారని వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 

Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola