విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి గురువారం చేదు అనుభవం ఎదురైంది. పాయకరావుపేట మండలం రాజవరం పర్యటనకు వెళ్లిన  ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి సొంత పార్టీ కార్యకర్తలు నుండే నిరసన వ్యక్తమైంది. రాజవరం గ్రామంలో మంచి నీటి పైపులైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో గ్రామంలోని వైసీపీకి చెందిన ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సొంత పార్టీ శ్రేణులే ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే బాబూరావు ఖంగుతిన్నారు. జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు అంటూ గ్రామస్తులు నినాదాలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే కారుకి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసన కారులను చెదరగొట్టారు. దీంతో పోలీసులకు, వైసీపీ నిరసనకారులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం ఎమ్మెల్యేను అక్కడ నుండి పంపించేశారు పోలీసులు. 



Also Read: వరి వద్దు.. రొయ్యల సాగు చేయండి ..రైతులకు ధర్మాన సలహా !


ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తోపులాట 


పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మరోసారి నిరసన సెగ తగిలింది. పార్టీ జెండా మోసిన వారిని కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులతో చేతులు కలిపి సొంత పార్టీ సర్పంచి, ఎంపీటీసీ అభ్యర్థులను ఓడించారని అసమ్మతి వర్గం ఆరోపించారు. కక్షగట్టి వాలంటీర్లను తొలగించారని అసమ్మతి వర్గం  నేతలు ఆరోపించారు. పార్టీకి చెడ్డపేరు తెస్తున్న ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి రానివ్వమని నిరసనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే చాలా సేపు వాహనంలోనే ఉండిపోయారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎమ్మెల్యే బాబూరావు గ్రామానికి చేరుకొని తాగునీటి పథకాన్ని, రహదారిని ప్రారంభించారు.


Also Read: మందుబాబులకు బంపర్ ఆఫర్.. న్యూ ఇయర్ ఈవెంట్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


ఎమ్మెల్యేపై సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం


పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. వాలంటీర్లు తమ మాట వినడం లేదని,  అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడంలేదంటున్నారు. మూడు మండలాల నాయకులు టికెట్‌ ఇవ్వొద్దని అడ్డుకుంటే, ఎస్‌.రాయవరం నుంచి అండగా నిలిచి గొల్ల బాబూరావును ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు. ఇటీవల పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా సమావేశమై ఆవేదన వ్యక్తం చేశారు. 


Also Read: సీఎం జగన్ అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్... ధూళిపాళ్ల వ్యాఖ్యలకు మంత్రి అప్పలరాజు కౌంటర్... సంగం, హెరిటేజ్ డెయిరీలను కోఆపరేటివ్ చేయాలని ఛాలెంజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి