మారుతి సుజుకి ఇటీవలే సెలెరియో కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మారుతి తర్వాతి తరం మోడల్స్ కూడా త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే రెండో తరం బలెనో, బ్రెజా కార్లను రూపొందిస్తుంది. దీంతోపాటు ఎంట్రీ లెవల్‌లో కొత్త తరం ఆల్టో కారును కూడా మారుతి సుజుకి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కారు ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన స్పై షాట్లు కూడా ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపించాయి. ప్రస్తుతం ఉన్న కారు కంటే దీని డిజైన్ కాస్త కొత్తగా ఉండనుంది. దీని లెంత్ కూడా పెరగనుందని తెలుస్తోంది. అంటే కారు పొడవు కూడా పెరగనుందన్న మాట. అలాగే కారు మరింత విశాలంగా కూడా ఉండనుంది.
ఈ కొత్త ఆల్టో కారు.. సెలెరియో ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది. కొత్త హెడ్‌లైట్ డిజైన్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త టెయిల్ లైట్స్ కూడా ఇందులో చూడవచ్చు. దీని ఇంటీరియల్ లే అవుట్‌లో కూడా పలు మార్పులు చేశారు. కొత్త టచ్ స్క్రీన్ సిస్టం, పవర్ విండోస్, యాబ్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
796 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉండనుందని తెలుస్తోంది. 47 బీహెచ్‌పీ, 69 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది అందించనుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉండనుంది. కొత్త తరం ఆల్టోలో కూడా ఇదే గేర్ బాక్స్‌ను అందించనున్నారని సమాచారం.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?